సెన్సార్‌లో మోహిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు ప్రేక్షకుల్లో తనదైన అందంతో అభినయంతో దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్‌గా ఆకట్టుకున్న త్రిష తిరిగి మోహినిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళం, తెలుగు భాషల్లో మోహినిగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ లక్ష్మి పిక్చర్స్ తెలుగులో విడుదల చేస్తున్నారు. ఎస్.లక్ష్మణ్‌కుమార్, శ్రీనివాసరావు పల్లెల, కరణం మధులత, గుంటూరు కాశిబాబు, డి.వి.మూర్తిలు సంయుక్తంగా ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మాణం చేపట్టారు. ఆర్.మాదేష్ దర్శకుడు. హర్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో త్రిషతోపాటు జాకీ, యోగిబాబు, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్యపాత్రల్లో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.బి.గురుదేవ్ సినిమాటోగ్రఫీ అందించారు. థింక్ మ్యూజిక్ ద్వారా ఈ చిత్రం ఆడియోని విడుదల చేశారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న రెండు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ- త్రిషకి తెలుగులో వున్న క్రేజ్ అందరికీ తెలుసు. మోహిని చిత్రం తనకి కమ్‌బ్యాక్‌గా వుంటుంది. హారర్ కామెడీ యాక్షన్ చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి క్రేజ్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. విజువల్ గ్రాండియర్‌గా హారర్ బ్యూటీతో అందరినీ అలరిస్తుంది. మాదేష్ చాలా మంచి కానె్సప్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. త్రిష పెర్‌ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. క్లీన్ యు సర్ట్ఫికెట్‌తో ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని చూసి సెన్సారు సభ్యులు దర్శకుడికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా త్రిష నటన ఆశ్చర్యపరిచిందని, ఆమెకి ఇది కమ్‌బ్యాక్‌గా నిలుస్తుందని చెప్పారు.