‘ఆదిత్య’కు వరల్డ్ రికార్డ్ పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిలింస్ పతాకంపై భీమగాని సుధాకర్‌గౌడ్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన బాలల చిత్రం ఆదిత్య క్రియేటివ్ జీనియస్. నవంబర్ 4, 2015న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఇప్పటికీ మధ్యాహ్నం ఆటతో పలు కేంద్రాల్లో ప్రదర్శితమవుతోంది. 19వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల్లో ఏకైక తెలుగు చిత్రంగా పురస్కారం గెల్చుకుంది. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఇండీవుడ్ చిత్రోత్సవంలో అవార్డ్‌నూ అందుకుంది. దాదాపు వంద దేశాల్లో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన ఘనత పొందింది. ఆదిత్య క్రియేటివ్ జీనియస్. వంద శాతం పన్ను రాయితీ పొందిన బాలల చిత్రంగా కూడా పేరు తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా బాల బాలికల్లో కులం మతం అనే బేధాలు ఉండకూడదని, కేవలం ప్రతిభ ఆధారంగానే పిల్లలు ఎదిగేలా చూడాలని, అబ్దుల్‌కలాం లాంటి అద్భుత శాస్తవ్రేత్తలు మన చుట్టూ ఉండే పిల్లల్లోనూ ఉండొచ్చని, వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచిస్తూ సందేశమిచ్చారు ఈ చిత్ర దర్శకుడు సుధాకర్‌గౌడ్. నేటికీ ఈ చిత్రం ప్రదర్శింపబడుతుండడమే కాకుండా పలువురి ప్రశంసలను, అవార్డులను పొందుతున్నందుకు గానూ ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్ర యూనిట్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపేందుకు మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సుధాకర్‌తో నాకు 10 సంవత్సరాలుగా పరిచయం వుంది. సినిమా చేస్తున్న టైమ్‌లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నాను. మీరు ఒక వేషం వెయ్యాలి అని అడిగారు. నేను కూడా వెంటనే ఓకే చెప్పాను. ఇప్పుడు అదే మా చిత్రం ‘ఆదిత్య’ క్రియేటివ్ జినియస్‌కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్‌తో పాటు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం, గౌరవాన్ని తెచ్చిపెట్టింది నాకు. ఇలాంటి సినిమాలను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇకపై కూడా సుధాకర్‌గారి నుంచి ఇంకా మంచి సినిమాలు వస్తాయని, రావాలని అలానే ఎన్నో అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తమిళనాడు మాజీ గవర్నర్ శ్రీ రోశయ్య మాట్లాడుతూ.. తెలుగు బాలల చిత్రం ‘ఆదిత్య’ క్రియేటివ్ జినియస్’కి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ పురస్కారం రావడం ఆనందంగా ఉంది అన్నారు. సుమన్ మాట్లాడుతూ.. మొదట ఈ పాత్ర ననే్న చేయమని ఎందుకు అడిగారనుకున్నాను.. కానీ సినిమా చూసాక ఇంత ఘనత దక్కాకే అర్థం అయ్యింది. నేను ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు నిజంగా కృతజ్ఞుడిని. నేటి కాలంలో బాలలకు సంబంధించిన సినిమాలు కరువయ్యాయి. ఇలాంటి టైంలో సుధాకర్‌గౌడ్ ఆదిత్య వంటి సినిమాను తెరకెక్కించడం గర్వంగా ఫీల్ అవుతున్నా అన్నారు. దర్శకుడు భీమగాని సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ.. పెద్దవాళ్లతో కంటే పిల్లలతో సినిమాలు తెరకెక్కించడం చాలా కష్టం. ఆ శ్రమను గుర్తించే జ్యూరీ సభ్యులు ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా నాకు నంది పురస్కారాన్ని అందించారు. సాధారణంగా బాలల చిత్రాలకు అవార్డ్‌లు ఇస్తుంటారు. కానీ బాలల చిత్ర దర్శకుడిగా పురస్కారం దక్కడం మరింత ఆనందంగా వుంది. మాజీ గవర్నర్ రోశయ్య, నటులు బ్రహ్మానందం, సుమన్ మరియు చిత్ర యూనిట్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని భీమనేని సుధాకర్ గౌడ్‌ను అభినందించారు.