సమంత యు టర్న్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ‘రంగస్థలం’, మహానటి, అభిమన్యుడుతో వరుస విజయాలను సొంతం చేసుకొని టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది ప్రముఖ హీరోయిన్ సమంత అక్కినేని. ఇక ఆమె ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ‘యు టర్న్’ అనే చిత్రంలో నటిస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది. పవన్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి, రాహల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్‌స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అదిస్తున్నారు.