వెబ్‌సిరీస్‌లో ప్రియాంక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమాలకు పర్యాయంగా వెబ్ సిరీస్‌లు రెడీ అవుతున్నాయి. వీటికి సినిమాల్లా కమర్షియల్ తలనొప్పులు ఉండవు.. తమ కానె్సప్ట్ మంచిదైతే చాలు జనాలు ఈజీగా చేసేస్తారు.. పైగా ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల మేనియా ఇండియాలో బాగా పెరిగింది. ఇప్పటికే కొన్ని వెబ్ సీరిస్‌లో దుమారం రేపుతున్నాయి. స్కేర్డ్ గేమ్స్ పేరుతో తెరకెక్కిన తాజా వెబ్‌సిరీస్ మాత్రం ఓ రేంజ్‌లో సంచలనం రేపుతోంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పింది బాలీవుడ్ క్రేజీ గర్ల్ ప్రియాంకా చోప్రా. ఇదివరకే ఆమె అమెరికన్ టివి సిరీస్ అయినా క్వంటికోలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ భారీ బడ్జెట్‌తో ఈ వెబ్‌సిరీస్‌ని రూపొందించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ షోలో నటించేందుకు ప్రియాంకాను అడిగారట.. ఆమె కూడా ఈ షో చేయడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. తాజాగా పలువురు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా వెబ్‌సిరీస్‌లో నటించి క్రేజ్ పెంచుకుంటున్న నేపథ్యంలో ప్రియాంకా కూడా అదే దారిలోకి ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు హాలీవుడ్‌లో రెండు సినిమాల్లో నటిస్తుంది. దాంతోపాటు బాలీవుడ్‌లో కూడా మరో రెండు సినిమాలకు సైన్ చేసింది.