ఎన్టీఆర్ క్రేజ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్న నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ సినిమా ఇటీవలే ఫిలిం సిటీలో మొదలైన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రను పోషిస్త్తున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బసవరామ తారకంగా బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటిస్తోంది. పలువురు తెలుగు స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు ప్రస్తుతం మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రాన్ని జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు బాలయ్య. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రానికి ప్రస్తుతం బిజినెస్ పరంగా భారీ హైప్ నెలకొంది. పలు ఏరియా హక్కుల కోసం అప్పుడే గట్టిపోటీ నెలకొంది. కొందరు డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడే లాబీలు కూడా చేస్తున్నారట. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. తాజాగా సావిత్రి బయోపిక్ మహానటికి ఏకంగా 40 కోట్ల షేర్ రావడంతో ఎన్టీఆర్ బయోపిక్‌పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా తప్పకుండా వంద కోట్లకు తగ్గకుండా షేర్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.