నితిన్‌తో మరోసారి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12 ఫ్లాపుల తరువాత ‘ఇష్క్’ సినిమాతో నితిన్‌కు విక్రమ్‌కుమార్ బ్రేకిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ ఊపును కంటిన్యూ చేసిన సినిమా ‘గుండె జారి గల్లంతయ్యిందే’. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ నిర్మించిన ఈ సినిమా నితిన్‌కు హీరోగా మంచి మైలేజ్‌నిచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు విజయ్‌కుమార్ కొండా వెలుగులోకొచ్చాడు.
‘గుండెజారి గల్లంతయ్యిందే’ తరువాత మరో సినిమాను నితిన్‌తోనే చెయ్యాలని ప్లాన్ చేసుకున్న అతని ప్లాన్‌ని నాగార్జున ఛిన్నాభిన్నం చేశాడని చెప్పక తప్పదు. ఈ సినిమా తరువాత పరిధిలోనే ఆలోచిస్తూ తక్కువ బడ్జెట్‌లో చేసిన సినిమా ‘ఒక లైలాకోసం’. ఈ సినిమా విజయ్ భవిష్యత్‌నే మార్చేసింది. దీంతో ఈ సినిమా తరువాత అతనితో సినిమా చేయాలని ఆలోచించినవాళ్ళు ‘ఒక లైలాకోసం’ ఫలితంతో ముఖం చాటేశారు. దీన్ని గమనించిన నితిన్ మళ్లీ విజయ్‌కుమార్ కొండాకు లిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాడట. ఇటీవలే నితిన్‌కు విజయ్‌కుమార్ కొండా కథ వినిపించాడట. కథ ఎక్స్‌లెంట్‌గా వుండడంతో తన సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌పై నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్ర కథ విని ఓ కన్నడ నిర్మాత నిర్మిస్తానని ముందుకొచ్చినా అతన్ని కాదని నేనే నిర్మిస్తానని నితిన్ ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. నితిన్ ప్రస్తుతం త్రివిక్రమ్ రూపొందిస్తున్న ‘అ ఆ’లో నటిస్తున్న విషయం తెలిసిందే.