కోన పౌడర్ ఎవరికోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితగా తెలుగు పరిశ్రమలో స్టార్ ఇమేజ్‌ని సంపాదించుకుని ప్రస్తుతం మరోవైపు నిర్మాతగా కూడా తన ప్రస్థానాన్ని సాగిస్తున్నాడు రచయిత కోన వెంకట్. ఇదివరకే ఆయన ‘గీతాంజలి’ చిత్రాన్ని నిర్మించాడు. తాజాగా నిఖిల్‌తో ‘శంకరాభరణం’ చిత్రాన్ని రూపొందించాడు.
ఈ చిత్రం ఈనెల 4న విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఆయన సొంత బ్యానర్‌పై ఏడాదికి మూడు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం హైదాబాద్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో ఓ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని అంటున్నారు.
ఇప్పటికే దీనికోసం కథ కూడా రెడీ అయిందని, క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రానికి ‘పౌడర్’ అనే టైటిల్‌ను కూడా పెట్టే ఆలోచనలో వున్నాడని అంటున్నారు. మరి ఈ పౌడర్‌ని ఎవరికి రాస్తాడో చూడాలి. కోన వెంకట్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ భాగస్వామ్యంలో ఈ సినిమాలు రూపొందుతాయని తెలిసింది.