తల్లి పాత్రలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మైనా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే తెలుగు, తమిళ భాషల్లో క్రేజీ హీరోయిన్‌గా మారిన హాట్ భామ అమలాపాల్. ఆ తరువాత దర్శకుడు విజయ్‌ని వివాహం చేసుకుని, కొంత గ్యాప్ తరువాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇప్పటికే సూర్య సరసన ‘మేము’ సినిమాలో తల్లి పాత్రలో నటించింది. లేటెస్టుగా ఓ సినిమాలో పదమూడేళ్ల అమ్మాయికి తల్లిగా నటించేందుకు ఓకె చెప్పడంతో ఇపుడు ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా ఇలాంటి బోల్డు పాత్రలు చేయాలంటే కాస్త గట్స్ ఉండాలి కదా! ధనుష్ హీరోగా నటిస్తూ నిర్మించే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. వయసులో ఉన్న క్రేజీ హీరోయిన్ ఓ పెద్ద అమ్మాయికి తల్లిగా నటించేందుకు ఆసక్తి చూపరు! కాని ఏకంగా 13 ఏళ్ళ అమ్మాయికి తల్లిగా నటించేందుకు ఓకె చెప్పి సంచలనం క్రియేట్ చేసింది అమలా పాల్!