పవన్ స్ఫూర్తితో హీరోనయ్యా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సతీష్‌బాబు, మెరినా అబ్రహం జంటగా రిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజు కుంపట్ల దర్శకత్వంలో జనార్దన్ మందుముల నిర్మిస్తోన్న చిత్రం ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో సతీష్‌బాబు గురువారం విలేకర్లతో ముచ్చటించారు.
‘చిన్నప్పటినుండి సినిమాలమీద వున్న ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చా. పవన్‌కళ్యాణ్ గారి స్ఫూర్తితో హీరో అయ్యా. మాది తూర్పు గోదావరి జిల్లాలోని కడియం. తరచూ అక్కడ సినిమా షూటింగ్స్ జరిగేవి. ఆ ఇన్‌ఫ్లుయెన్స్ నామీద బాగా ఉండేది. నేనే కథలు రాసుకొని రిహార్సల్స్ చేసేవాడిని. ఫేస్‌బుక్‌లో నా ఫొటోలు చూసిన ఒక వ్యక్తి ఆడిషన్‌కు రమ్మని పిలిచారు. చాలా కష్టాలు పడ్డా. ఆ తరువాత ‘ప్రేమ ఒక మైకం’ సినిమాలో నటించాను. హీరోగా ‘రొమాన్స్ విత్ ఫైనాన్స్’ సినిమాతో పరిచయం అవుతున్నా. అందమైన ప్రేమ వెనుక దాగి ఉన్న రొమాన్స్, దానికి కప్పి వున్న ఫైనానే్స ఈ సినిమా కథ. జై అనే పాత్రలో కనిపిస్తా.జై ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. వారి ఇద్దరిమధ్య కొన్ని అపార్థాలు చోటుచేసుకుంటాయి. ఆ తరువాత ఏం జరిగిందనేది సినిమా కథ. ఇందులో లవ్, రొమాన్స్‌లతోపాటు మంచి కామెడీ కూడా వుంటుంది. మొత్తం ఐదు పాటలుంటాయి. టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా జాన్ మ్యూజిక్ అందించాడు. రంపచోడవరం, వైజాగ్, కేరళ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించాం. మార్చి 18న రిలీజ్ అవుతోన్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం ‘జానీ’ అనే కొత్త దర్శకునితో శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై ఓ సినిమాలో నటిస్తున్నా. ఒక షెడ్యూల్ పూర్తయింది’ అని చెప్పారు.