కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనివాసరెడ్డి, ధీరేంద్ర, ప్రవీణ్, బిందు, కారుణ్య హీరో హీరోయిన్లుగా శ్రీకర్‌బాబు దర్శకత్వంలో వేద ఎంటర్‌ప్రైజెస్ ప్రొడక్షన్ నెంబర్ 2 సినిమా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. దగ్గుబాటి వరుణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రసన్నకుమార్ క్లాప్ కొట్టగా.. అశోక్‌కుమార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, దర్శకుడు అనేవాడు నిర్మాత దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయమని, దగ్గుబాటి వరుణ్, శ్రీకర్‌బాబుతో ఇదివరకే ‘ముసుగు’ అనే సినిమాను నిర్మించాడని, ఆ సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉందని, తనమీద నమ్మకంతో అప్పుడే రెండో సినిమాను కూడా వరుణ్ నిర్మిస్తున్నాడన్నారు. సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మారాయని, సక్సెస్, ఫెయిల్యూర్ మన చేతుల్లో వుండవని, ఎందరో యువకులు ఫాషన్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారని, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యమని, గంగోత్రి విశ్వనాధ్, నేను చేసిన యాభై సినిమాలకు పనిచేసి ఉంటారని, ఆయన కుమారుడు దర్శకునిగా మారి రూపొందించిన ఈ సినిమా సక్సెస్ కావాలి అని చెప్పారు. దర్శకుడు శ్రీకర్‌బాబు మాట్లాడుతూ, కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ సినిమాలో ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని, అలానే ఓ ప్రముఖ హీరోయిన్ ఈ సినిమాలో కనిపించబోతోందని అన్నారు. సినిమా మొదటి షెడ్యూల్ కాలేజీలో చిత్రీకరించి, రెండో షెడ్యూల్ వైజాగ్‌లో షూట్ చేయాలనుకుంటున్నామన్నారు. నిర్మాత వరుణ్ దగ్గుబాటి మాట్లాడుతూ, కామెడీ, హారర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇదివరకు శ్రీకర్, నేను కలిసి ‘ముసుగు’ అనే సినిమాను తెరకెక్కించామని, ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కానుందన్నారు. శ్రీకర్‌మీద నమ్మకంతో మరో సినిమాను కూడా నిర్మిస్తున్నానని చెప్పారు.
ఈ చిత్రానికి లిరిక్స్, డైలాగ్స్:గంగోత్రి విశ్వనాధ్, మ్యూజిక్ డైరెక్టర్:అమోగ్ దేశపతి, నిర్మాత:దగ్గుబాటి వరుణ్, కథ, దర్శకత్వం:శ్రీకర్‌బాబు.