లక్ష్మి పాటలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మాతగా ప్రభుదేవా, ఐశ్వర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘లక్ష్మి’. ఎ.ఎల్.విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా కిడ్స్ డాన్స్ రియాలిటీ షో సూపర్ డాన్సర్ సీజన్ 1 విజేత అయిన దిత్య బండే నటిగా పరిచయమవుతోంది. డాన్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో దిత్య డాన్స్ గురువుగా ప్రభుదేవా కనిపిస్తుండడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయి రెండు టీజర్స్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ రాగా సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర ఆడియో విడుదల హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మురళీమోహన్, క్రిషన్, వి.వి.వినాయక్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ- ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేసిన క్రిష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమాకి పనిచేసిన బృందానికి థాంక్స్ చెప్పారు. ప్రభుదేవా గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఏం చెప్పాలి. ఈ సినిమాలో ఆయన నటుడు మాత్రమే కాదు.. ఒక గాడ్ ఫాదర్ కూడా. ఆయన వెనకుండి ఈ సినిమా నడిపించారు. చాలా థాంక్స్ సర్ అన్నారు. ఈ చిత్రానికి ఈ చిన్నారి డాన్సర్ చాలా బాగా కష్టపడ్డారన్నారు. దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ- ప్రభు మాస్టర్ అంటే మా అందరికీ చాలా గౌరవం. అన్ని భాషల్లో ఆయన ఇంత గొప్ప కీర్తిని సంపాదించి ఇప్పటికీ లైం లైట్‌లో ఉన్నారంటే చాలా గొప్ప విషయం. దర్శకుడు విజయ్ గురించి మాట్లాడుతూ చాలా అర్థవంతమైన మూవీస్ తీయటంలో విజయ్‌కి పోటీ ఎవరూ లేరు అన్నారు.