విజయ్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌దేవరకొండ ‘గీత గోవిందం’ విజయంతో ఉరకలు వేస్తున్నాడు. వరస చిత్రాలతో బిజీబిజీగా గడిపేస్తున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ మొదలుపెట్టేసిన విజయ్ సెప్టెంబరునుండి ‘మళ్ళీమళ్ళీ ఇది రాని రోజు’ దర్శకుడు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాకోసం డేట్లు కేటాయించనున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మిస్తున్నారు. గత కొన్నినెలలుగా క్రాంతిమాధవ్ మరియు కెఎస్‌రామారావు ఇద్దరూ విజయ్ సరసన నటించే కథానాయకని వెతికే పనిలోఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కథ పరంగా చాలా ముఖ్యమైనదట. హీరో పాత్రకు సమానంగా ఉంటుందని తెలుస్తోంది. తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం క్రేజీ హీరోయిన్ రాశీఖన్నాను హీరోయిన్ పాత్రకోసం తీసుకోనున్నారని సమాచారం.