‘శుభలేఖ+లు’ రెండో పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెళ్లి అంటే నమ్మకంపై మాత్రమే నిలబడే బంధం. అంటే ఆ తంతు నిజాయితీగా జరగాలి. ఆ నిజాయితీ జీవితాంతం ఉంటుందనే నమ్మకం ఉన్నప్పుడే ఏ పెళ్లి బంధమైనా ఆనందంగా కొనసాగుతుంది. అబద్ధపు పెళ్లిళ్లలో ఆడంబరం ఉంటుంది. కానీ ఆనందం ఉండదు అనే అంశం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందుతోన్న సినిమా ‘శుభలేఖ+లు’. ఈ చిత్రం టైటిల్ నుంచి..విడుదల చేసిన టీజర్, ఫస్ట్ వీడియోసాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రెండో వీడియో పాటను స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదల చేశారు. ‘శృంగారాల హరీ శృతజన శుభకరీ సౌందర్య లహరీ’ అంటూ అచ్చతెలుగు పదాలతో సాగే ఈ పాటపై వినాయక్ ప్రశంసల వర్షం కురిపించాడు. కె.ఎమ్ రాధాకృష్ణన్ సంగీతం అందించిన ఈ పాట ట్యూన్ వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాకు రాధాకృష్ణ సంగీతం ఓ హైలెట్‌గా నిలుస్తుందని దర్శక, నిర్మాతలు ముందునుంచీ చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడీ రెండో వీడియోసాంగ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఈ సినిమాకు సంబంధించి ప్రతి విషయంలోనూ పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. వాటిని ఈ పాట రెట్టింపు చేసింది. చాలా ఇన్నోవేటివ్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంతో శరత్ నర్వాడే దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ‘శుభలేఖ+లు’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా సెప్టెంబర్‌లో విడుదల కాబోతోంది. సాయి శ్రీనివాస్, దీక్షాశర్మ జంటగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని ఓ కీలక పాత్రలో నటిస్తోంది. వంశీ నెక్కంటి, మోనా బేద్రే, అప్పాజీ, డా.ఇర్ఫాన్, తిరువీర్, సింధు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కథ-మాటలు: జనార్ధన్-విస్సు, సంగీతం: కెఎమ్ రాధాకృష్ణన్, సినిమాటోగ్రఫీ: మురళీమోహన్‌రెడ్డి, ఎడిటర్: మధు, ఆర్ట్: బ్రహ్మకడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, నిర్మాతలు: సి.విద్యాసాగర్, ఆర్.ఆర్.జనార్ధన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరత్ నర్వాడే.