సిద్ధమైన వీరివీరి గుమ్మడిపండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్ర, వెనె్నల, సంజయ్, బంగారం ప్రధాన తారాగణంగా ఎం.వి.సాగర్ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్ రూపొందించిన చిత్రం ‘వీరి వీరి గుమ్మడిపండు’. శివకృతి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.
ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎం.వి.సాగర్ మాట్లాడుతూ, ఫ్యామిలీ, హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాడింగ్ ఆర్టిస్టులు మినహా 63 మంది కొత్తవాళ్లే నటించారని, హారర్ చిత్రాలలో భిన్నంగా సాగే ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం వుందని తెలిపారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటుగా హారర్ జోనర్‌లో సాగే కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం హైలెట్‌గా వుంటుందని, అన్ని వర్గాలకు నచ్చే అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత కిరణ్‌కుమార్ అన్నారు. రఘుబాబు, హార్దిక్, రుషిత, శివన్‌నారాయణ, దీక్షిత్, అనంత్, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:శక్తిస్వరూప్,
సంగీతం:పి.ఆర్., కెమెరా:కె.ఎమ్.కృష్ణ, దర్శకత్వం:ఎం.వి.సాగర్.