నాయకి విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష, గణేష్ వెంకట్రామన్ ప్రధాన పా త్రల్లో గోవి దర్శకత్వంలో గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నాయకి’. రాజ్‌కందుకూరి సమర్పకులు. ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు టీజర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీజర్ చాలా ఇంప్రెస్‌గా వుందని, సినిమా తప్పకుండా బాగుంటుందనే నమ్మకం కలిగిందని అన్నారు. గిరిధర్ జర్నలిస్టుగా తెలుసునని, అలాగే ‘లక్ష్మీరావె మా ఇంటికి’ సినిమాతో నిర్మాతగా మారాడని, ఆ సినిమా కంటే ‘నాయకి’ పెద్ద విజయాన్ని అందుకుంటుందని అన్నారు. హీరోయిన్లను లీడ్‌గా పెట్టుకుని ఇప్పుడు సినిమాలు ఎక్కువగా వస్తున్నాయని, ఇలాంటి సినిమాలు నేనప్పట్లోనే చాలా తీశానని. స్టార్ హీరోయిన్‌ని పెట్టి తీసిన ‘ఒసేయ్ రాములమ్మ’ సినిమా చరిత్రను తిరగరాసిందని అన్నారు. హీరోయిన్లు కూడా హీరోలకు సమానంగా వసూళ్లు సాధిస్తున్నారని, ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు గోవి అభినందిస్తున్నానన్నారు.. త్రిష మంచి నటి అని, ఈ సినిమాతో ఆమెలో మరో కోణం బయటపడుతుంది అన్నారు. త్రిష మాట్లాడుతూ ‘ఇది నా మొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిం. దీన్ని హారర్ కాకుండా రెట్రో హారర్ అని పిలుస్తారు.
ఈ సినిమాకు అందరూ కష్టపడి పనిచేశారు. తప్పకుండా మీ సపోర్టు కావాలి’ అన్నారు. నిర్మాత గిరిధర్ మాట్లాడుతూ, ఇది మా రెండో చిత్రమని, త్రిష మేనేజర్‌గా ఏడెనిమిది సంవత్సరాలుగా వుంటున్నానని, విజయశాంతి తరువాత మేనేజర్‌కు సినిమా చేసిన హీరోయిన్ త్రిషే కావడం విశేషమని, గోవి మంచి కథను ఇచ్చాడని, త్రిష మూడు డైమెన్షన్ వున్న పాత్రల్లో కన్పిస్తుందని, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఏప్రిల్ చివరిలో విడుదల చేస్తామన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:గౌతమ్‌రాజు, సంగీతం:రఘు కుంచె, కెమెరా: జగదీష్ చీకటి, నిర్మాత:గిరిధర్ మామిడిపల్లి, పద్మజ, దర్శకత్వం:గోవి.