ఫ్రైడే ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ మీనాక్షి మూవీస్ పతాకంపై కె.ఎస్.ఆర్.దాస్ అకాడమీ సమర్పణలో నిర్మాత కె.సత్యారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఫ్రైడే’. కిషన్.కె.కె హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రం శుక్రవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంది. ఈ నూతన చిత్రానికి మంత్రి హరీష్‌రావు క్లాప్‌నివ్వగా, సి.కల్యాణ్ గౌరవ దర్శకత్వం వహించగా, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ కెమెరా స్విచ్చాన్ చేశారు. షాద్‌నగర్ ఎంఎల్‌ఏ అంజయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఈ చిత్ర దర్శకుడు దాసరి లారెన్స్ మాట్లాడుతూ- క్రైమ్ ఇనె్వస్టిగేషన్ స్టోరీతో చిత్రం ఉంటుంది. హీరో పోలీసు ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. మంచి కథతో ముందుకు వస్తున్నాము. ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. హీరో కిషన్ మాట్లాడుతూ- దర్శకుడు దాసరి లారెన్స్ ఎంతో కష్టపడి సినిమాను ప్లాన్‌చేశారు. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ సత్యారెడ్డి స్క్రిప్ట్ అందించారు. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. బేబీ మీనాక్షి ఇందులో లీడ్ రోల్ ప్లే చేస్తుంది. క్రైమ్ పోలీసు అఫీసర్ పాత్రలో నూతనంగా హీరోగా పరిచయం అవుతున్నా.. ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నిర్మాత సత్యారెడ్డి మాట్లడుతూ- డిఫరెంట్ కానె్సప్ట్. నవరసాలు ఉన్న స్టోరీ. చెప్పాలంటే ఉగాది పచ్చడి లాంటి చిత్రం ఫ్రైడే. షూటింగ్ సెప్టెంబర్ 5 నుండి మొదలుపెట్టనున్నాము అన్నారు. కొత్త కథ, అందులోనూ క్రైమ్ జోనర్. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. అందరికీ నచ్చుతుంది. మంచి పాత్రలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు అని హీరోయిన్స్ కాశ్మీర, సుమన పూజారి తెలిపారు. కిషన్ కె.కె., కాశ్మీర, సుమన పూజారి, పండు, మీనాక్షి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కొరియోగ్రఫీ : భరత్, ఆర్ట్: పి.డేవిడ్, ఫైట్స్: నందు, మాటలు: ఎం.అనురాగ్ విశ్వక్, మధుసూదన్, నిర్మాత: సత్యారెడ్డి, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దాసరి లారెన్స్.