యు టర్న్ ట్రైలర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యు టర్న్’ చిత్రం ట్రైలర్ విడుదలయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ- ఓ వైపు మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయి మరణం.. మరో వైపు కేరళ వరదలు ముంచెత్తుతున్న ఈ సమయంలో కూడా తమ సినిమా ప్రెస్‌మీట్‌కు వచ్చినందుకు మీడియాకు ధన్యవాదాలు. కానీ మాది చిన్న సినిమా. అందరూ అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. యు టర్న్ అనేది ఓ హానెస్ట్ సినిమా. దీనికి పనిచేసిన వాళ్లంతా వందశాతం తమ కృషి చేశారు. ఇది మంచి సినిమా అని.. మేం మంచి ప్రయత్నం చేసామనే అనుకుంటున్నాం. కెరీర్‌లో తొలిసారి కొత్త నిర్మాతలతో పనిచేస్తున్నాను. చాలా కంఫర్ట్‌గా ఉంది. మా దర్శకుడు పవన్‌కుమార్ కూడా అద్భుతంగా పనిచేసాడు. కన్నడలో పెద్ద దర్శకుడు అయినా కూడా ఇక్కడ బాగా సపోర్ట్ చేశాడు. ప్యూచర్‌లో మరో సినిమా కూడా చేయాలని కోరుకుంటున్నాను. రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టి ఈ చిత్రానికి మరింత సపోర్ట్ పవర్ అందించారు. సినిమాటోగ్రాఫర్ నికేత్ ఇండస్ట్రీలో చాలా దూరం వెళ్తాడని ఆశిస్తున్నాను అని చెప్పారు. దర్శకుడు పవన్‌కుమార్ మాట్లాడుతూ- సమంతను మూడేళ్ల కింద కలిశాను. ఆమెతో ప్రయాణం అద్భుతంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీ కూడా చాలా బాగుంది. ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. ఇదే రోజు నా తొలి తెలుగు సినిమా ట్రైలర్ విడుదల కావడం నిజంగా యాధృచ్చికమే. యు టర్న్ ఆసక్తికరంగా ఉంటూనే నవ్విస్తూ ఎన్నో పరిశీలనకు సమాధానంగా నిలుస్తుంది. మంచి క్యాస్టింగ్‌తోనే ఈ సినిమాను తెరకెక్కించాం అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ- పదేళ్ల కింద నేను, సమంత కలిసి పనిచేశాం. అప్పటికి ఇప్పటికీ సమంత నటిగా పూర్తిగా మారిపోయింది. గొప్ప నటిగా ఎదిగింది. ఇది సూపర్‌హిట్ అవుతుందని నమ్ముతున్నాను అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ- ఈ సినిమా చాలా మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఇలాంటి టీమ్‌తో మళ్లీ పని చేయాలనుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ నికేత్ బొమ్మి, నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు తదితరులు పాల్గొని మాట్లాడారు.

చిత్రం..సమంత అక్కినేని