సూపర్‌స్టార్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిష.. దాదాపు దశాబ్దకాలంపైగా సౌత్‌లో క్రేజీ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ భామకు ఈమధ్య కెరీర్ బాగా నెమ్మదించింది. దాంతో పెళ్లికి రెడీ అయి.. ఆ తరువాత అది ఆగిపోయి పెద్ద తతంగమే జరిగింది. దాంతో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాల్లో బిజీ అయిన ఈ గ్లామర్ భామకు సెకెండ్ ఇన్నింగ్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న నాయకి అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఈ అమ్మడి ఆశలు నీరుగారిపోయాయి. అయినా ప్రస్తుతం ఆరు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడి చిరకాల కోరికను మొత్తానికి నెరవేర్చుకుంది. ఆ కోరిక ఏమిటో తెలుసా.. సౌత్‌లో అందరు స్టార్లతో నటించిన త్రిష, ఒక్క రజనీకాంత్‌తో నటించలేదన్న లోటు మిగిలింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇపుడు ఆ కోరిక ఫుల్‌ఫిల్ చేసుకుంటోంది ఈ అమ్మడు. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 162వ చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హర్రర్ సినిమాలో త్రిషను ఎంపిక చేశారట. దాంతోపాటు ఈ అమ్మడు నటిస్తున్న 96, గర్జనై, చతురంగ వెట్టై, 1818, పరమపదం విలయట్టు లాంటి చిత్రాల్లో నటిస్తోంది.