బెల్లంకొండ శ్రీనివాస్‌తో మెహరీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంకొండ శ్రీనివాస్ ఐదో సినిమాలో మెహరీన్ కౌర్ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌లో అడుగుపెట్టింది ఈ భామ. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. కొత్త దర్శకుడు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఓ కొత్త కానె్సప్ట్‌తో బెల్లంకొండ శ్రీనివాస్‌ను పూర్తిగా కొత్త లుక్‌తో చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. కాజల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ ఐదో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్, మెహ్రీన్‌కౌర్, ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్: సినిమాటోగ్రాఫర్: ఛోటా కె. నాయుడు, సంగీతం: ఎస్.ఎస్ థమన్, సహ నిర్మాత: చాగంటి సంతయ్య, నిర్మాత: నవీన్ సొంటినేని, దర్శకత్వం: శ్రీనివాస్,