‘జిందా గ్యాంగ్’ టీజర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ సీనియర్ నటుడు దేవరాజ్ ముఖ్య పాత్ర పోషిస్తున్న చిత్రం జిందా గ్యాంగ్. కన్నడంలో ఘన విజయం సాధించిన ఈ సినిమాని తెలుగులోకి అనువదిస్తున్నారు. మేఘన రాజ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కన్నడంలో సుదీప్, పునీత్‌రాజ్‌కుమార్ లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేశారు. శ్రీ మంజునాథ క్రియేషన్స్ పతాకంపై ఎస్.మంజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో యువరాజ్ మాట్లాడుతూ... ఈ సినిమా 1979లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. మాటల రచయిత సూర్య మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా దండుపాళ్యం కంటే పెద్ద హిట్ అవుతుంది అని అన్నారు. సహ నిర్మాత చలపతిరావు మాట్లాడుతూ... ఈ చిత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. హీరోయిన్ మేఘన రాజ్ చాలా బాగా చేసింది. ఈ చిత్రానికి సంబంధించి 150 టైటిల్స్ చెప్పాను. అందులో జిందాగ్యాంగ్‌ని సెలెక్ట్ చేశారు. చాలా కొత్తగా ఉంటుంది అని అన్నారు. మాటల రచయిత సురేష్ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ.. 1979లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. పొలెగాళ్ గ్రామంలో జరిగింది. జిందాగ్యాంగ్ అనే గ్యాంగ్ నిజంగా ఇప్పటికీ ఉంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలో దండుపాళ్యంలా తమ ఊరిని చూపిస్తున్నారు అని గొడవలు చేశారు. వాటిని తట్టుకుని నిలబడ్డాం అని అన్నారు. కొత్త ఆర్టిస్టులు చాలా బాగా చేశారు. అందరికీ థాంక్స్ చెప్పారు. నిర్మాత మంజు మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ అంటే బిగ్ ప్లాట్‌ఫార్మ్. మేము ఈ స్టేజ్ మీద ఉన్నందుకు గర్వంగా ఉంది. డైరెక్టర్ గారికి థాంక్స్ అని అన్నారు. మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి అన్నారు. నటుడు కృష్ణ మాట్లాడుతూ.. ఈ చిత్రం మొదలవుతున్నప్పుడు కో-డైరెక్టర్‌గా చేస్తున్నాను. ఈ చిత్రానికి ఐదుగురు కావాలని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. టెక్నీషియన్‌ని నటించేలా చేసినందుకు డైరెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.