గీత గోవిందం విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ.. రష్మికా మందన్నా జంటగా నటించిన సినిమా ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై రూపొందింది. అల్లు అరవింద్ సమర్పించారు. బన్నీ వాసు నిర్మించారు. ఈనెల 15నవిడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బన్నీవాసు మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులను చూసి ఇంత పెద్ద సక్సెస్ చేసిన వాందరికీ ధన్యవాదాలు. నేను మొదట థాంక్స్ చెప్పేది మెగాస్టార్ చిరంజీవిగారికి. ప్రతి ఇంట్లోనూ ఏదైనా పూజ చేసుకునేటప్పుడు గణపతిని స్మరించుకుంటాం. అలాగే మెగా స్టార్‌ను సమర్పించుకుంటాం. నా సోల్, నా బ్రీత్ బన్నీకి కూడా థాంక్స్.. నా లైఫ్‌లో మరింత గొప్ప స్థాయికి వెళ్లినప్పుడు అరవింద్‌గారి గురించి మాట్లాడాలనుకుంటాను. ఇప్పుడు కూడా మాట్లాడను. ఇంకా నేను ఎదిగిన తర్వాత ఆయన గురించి మాట్లాడతాను.. అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘ఈ మధ్య చాలా ఫంక్షన్స్‌కు వెళ్లాను. అయితే ఇక్కడున్న వైబ్రేషన్స్ చూస్తుంటే ఇది మాదా? విజయ్ దేవరకొండదా? అనేది అర్థం కాలేదు. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో అందరినీ కలవడం ఆనందంగా ఉంది. విజయ్ చాలా హుషారైన హీరో. సినిమా చూసిన తర్వాత నా ఆనందాన్ని వ్యక్తం చేశా. దాంతో చాలదన్నట్టుగా ఈ చిత్ర యూనిట్ వచ్చి సక్సెస్‌మీట్‌కి రావాలి అని ఆహ్వానించారు. నేను వస్తే వారి ఆనందం పరాకాష్టకు చేరుకుంటుందని అన్నారు. నిజానికి ఈరోజు షూటింగ్ ఉంది. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు కొన్ని వందల మందితో షూటింగ్ చేశాం. ఇలాంటి వేడుకల్లో పాల్గొనడం వల్ల నాకు ఆనందంగా ఉంటుంది. ఇంత ఆనందం మాకు ప్రేక్షకులే ఇచ్చారు. వాళ్ల ఆశీస్సులతో మాత్రమే ఇది దక్కింది. సినిమా బావుందంటే బడ్జెట్ గురించి ప్రేక్షకులు పట్టించుకోరు. ఈ సినిమా అలరించింది కాబట్టి ఆదరించారు. ఈమధ్య గత రెండేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది. ప్రోత్సాహంగా ముందుకెళ్తోంది అన్నారు.