జక్కన్నగా సునీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఆర్.సుదర్శన్‌రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘జక్కన్న’. ఈ సినిమా టైటిల్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ, కొంచెం గ్యాప్ తరువాత మాస్, ఎనర్జిటిక్ రోల్‌లో చేసిన సినిమా ఇదని, ‘రక్ష’ సినిమాతో మంచి దర్శకుడిగా వంశీ గుర్తింపు తెచ్చుకున్నాడని, కొత్త పాయింట్‌ను తీసుకుని ఈ సినిమా చేశాడని అన్నారు. ఎందుకూ పనికిరాని ఓ మనిషి అద్భుతంగా ఎలా మారాడనే కథతో ఈ సినిమా వుంటుందని, పూర్తి స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా ఇది అన్నారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్న చిత్రమిదని, ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, సమ్మర్‌లో విడుదల చేస్తామన్నారు. నిర్మాత సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ, ‘ప్రేమకథా చిత్రమ్’ తరువాత మంచి కథతో సినిమా చేయాలని అనుకున్నపుడు వంశీ చెప్పిన కథ బాగా నచ్చిందని, ఆ సినిమాలో ఎన్ని ట్విస్టులుంటాయో, ఈ సినిమాలో అంతకుమించి ఉంటాయని, మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా:రామ్‌ప్రసాద్, సంగీతం:దినేష్, ఎడిటింగ్:ఎం.ఆర్.వర్మ, మాటలు:్భవాని ప్రసాద్, ఆర్ట్:మురళి, నిర్మాత:సుదర్శన్‌రెడ్డి, దర్శకత్వం:వంశీకృష్ణ ఆకెళ్ల.