అబ్బే...అదేంలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు లేకపోవడంతో ప్రతి కార్యక్రమానికి ఠంచన్‌గా అటెండ్ అవుతోంది శ్రీయ. క్యాట్‌వాక్‌లలో తన సరదాను ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ వయ్యారిభామపై టాలీవుడ్‌లో ఓ పుకారు షికారు చేసింది. రాజవౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాహుబలి-2’లో శ్రీయ కథానాయికగా నటిస్తోందని ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. దానికితగ్గట్టు రానాతో కలిసి ఆమె పలు కార్యక్రమాలకు హాజరవడంతో ఆ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. ఈ విషయమై శ్రీయను అడిగితే ఆ చిత్రంలో తాను లేనని ఖరాఖండీగా చెప్పింది. ఈ సినిమా కోసం తననెవరూ అడగలేదని అంటోంది. ఇప్పటికే రాజవౌళి దర్శకత్వంలో ‘్ఛత్రపతి’లో నటించిన శ్రీయకు కొత్తగా చెప్పేదేం లేదు. రాజవౌళికి శ్రీయ ప్రతిభ తెలుసు కనుక ఆమెకు సరిపోయే పాత్ర ఏదన్నా వుంటే తప్పక ఇస్తాడేమో వేచి చూడాల్సిందే!