యువత ఆలోచనలకు అద్దంపట్టేలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వీన్‌రాజ్ (ప్లేయర్ ఫేం) కథానాయకుడిగా లార్డ్ శివా క్రియేషన్స్ పతాకంపై శేషసాయి మరుప్రోలు దర్శకత్వంలో ఎం.వి.ఎస్.సాయి కృష్ణారెడ్డి రూపొందిస్తున్న చిత్రం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. కథానాయకుడు పర్వీన్ రాజ్, సాక్షీ చౌదరిలపై నిర్మాత క్లాప్‌నివ్వగా, కోన రఘుపతి కెమెరా స్విచ్చాన్ చేశారు. వి.సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ, నేటి యువత ఆలోచనాధోరణి ఎలా వుంటుంది అన్న అంశంతో ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని తెలిపారు. సాక్షీచౌదరి మెయిన్ లీడ్‌లో నటిస్తున్న ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి పాత్ర విభిన్నంగా సాగుతుందని, ఏప్రిల్ 1 నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుందని తెలిపారు. ఓ మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందిన కథనం నచ్చడంతో ఈ సినిమా చేయడానికి తాను ముందుకు వచ్చానని సాక్షీ చౌదరి తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను రూపొందిస్తున్నామని, నేటి యువత తప్పకుండా చూడవలసిన చిత్రం ఇదని, పక్కా కామెడీ ఎంటర్‌టైనర్‌గా స్క్రిప్ట్ సిద్ధమైందని నిర్మాత సాయికృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పూజిత, పర్వీన్‌రాజ్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు. ఝాన్సీ, సప్తగిరి, షకలక శంకర్, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు: శ్రీగణేశ్, శేషసాయి, కెమెరా:కంతేటి శంకర్‌రావు, సంగీతం: కిషన్ కవాడియా, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: ఎం.వి.ఎస్.సాయికృష్ణారెడ్డి, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శేషసాయి మరుప్రోలు.