రొమాంటిక్ కామెడీతో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన జివి హీరోగా హీరోజయిం మూవీకాదు ఇది జీరోయిజం.. అనే క్యాప్షన్‌తో మామ రెండు జెగ్గులు అనే టైటిల్‌తో ముందుకు వస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఫిలిం ఛాంబర్‌లో పూజాకార్యక్రమాలు జరిపారు. జెడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో సురేష్ పాని, మేఘన హీరోయిన్‌లుగా నటించనున్నారు. తొలిసారి ఈ ఇద్దరికి ఇదే మొదటి సినిమా. ప్రముఖ వ్యక్తి ప్రసన్నకుమార్, మరియు కూచిపూడి వెంకట్, డైరెక్టర్ సాగర్ ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఎక్స్‌యాక్సెస్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. ఒక ఊరమాస్ అబ్బాయికి స్వచ్ఛ్భారత్‌కి బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఒక క్లాస్ అమ్మాయికి మధ్య జరిగే కథ ఈ చిత్రం. ఇదొక రొమాంటిక్ కామెడీ చిత్రం. ఇప్పటివరకు సినిమాల్లో హీరోయిజాన్ని మాత్రమే చూసిన ప్రేక్షకులు ఇప్పుడు జీరో ఇజంని చూస్తారు కొత్త మరియు పాత ఆర్టిస్టులు కలయికతో రూపొందబోతున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్‌ని ప్రారంభించి నవంబర్, డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తాం అంటున్నారు నిర్మాతలు. ఇది అందరికీ నచ్చే విధంగా ఉంటుంది. ఇందులోని ప్రతీ క్యారెక్టర్ అందర్నీ ఆలోచింపజేస్తుంది. మంచి కథ, కథనంతో తెరకెక్కబోయే ఈ చిత్రం విషయంలో ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తాం. ఇందులో హీరో హీరోయన్ల పాత్రలు అలరిస్తాయ. క్యారెక్టర్ల చుట్టూ అల్లుకున్న ఓ రొమాంటిక్ ప్రేమకథ ఇది. గతంలో ఇలాంటి ప్రేమకథలు ఎవరూ చూసి వుండరు. అంతా కొత్తగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ చిత్రంలోని ఇతర పాత్రల్లో కుమారి, మధు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: సుబ్రమణ్యం, మాటలు: సుబ్రమణ్యం, జెడి, ధరణి కోట, కెమెరా: ఆర్య, మ్యూజిక్: త్రినాథ్, పాటలు: వౌనశ్రీ మల్లిక్, సాంకేతిక నిపుణులు: అడిషనల్ స్క్రీన్‌ప్లే, దర్శకుడు: జె.డి, నిర్మాత: చింతల జెఎస్ కుమార్ (జోషి), బ్యానర్: ఎక్స్‌యాక్సెస్ క్రియేషన్స్.