వెబ్ సిరీస్‌గా సముద్రం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో కూడా బయోపిక్ సినిమాల హవా బాగా పెరిగింది. ఇప్పటికే అన్న ఎన్టీఆర్, వైఎస్ యాత్ర, పుల్లెల గోపీచంద్ బయోపిక్, సైనా నెహ్వాల్ బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన మహానటి సంచలన విజయం సాధించడంతో బయోపిక్ సినిమాల క్రేజ్ బాగా పెరిగింది. ప్రస్తుతం మెగాస్టార్ సైరా కూడా బయోపిక్ కావడం విశేషం. తాజాగా ప్రముఖ నటుడు జగపతిబాబు బయోపిక్ కూడా తెరకెక్కనుంది. అయితే అది సినిమాగా కాదు వెబ్‌సిరీస్‌గానట. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వెబ్ సిరీస్ 25 ఎపిసోడ్స్‌గా ఉంటుందని తెలిసింది. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన జగపతిబాబు క్రేజీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా శోభన్‌బాబు తరువాత ఇద్దరు హీరోయిన్ల హీరోగా ఇమేజ్ అందుకున్న ఆయన సోలో హీరోగా వరుస పరాజయాలు రావడంతో.. విలన్ పాత్రల వైపు మొగ్గు చూపాడు. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ, మలయాళ భాషల్లో జగపతిబాబుకు మంచి క్రేజ్ ఉంది. సో ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించి త్వరలోనే ప్రకటన రానుందట. అన్నట్టు ఈ సిరీస్‌కు సముద్రం అనే టైటిల్ పడుతున్నట్టు తెలిసింది.