ఆకట్టుకునే నర్తనశాల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛలో’లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తరువాత నాగశౌర్య, ఐరా క్రియేషన్స్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘...నర్తనశాల’. శంకరప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మాత. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకుడు. కష్మిరా పరదేశి, యామిని భాస్కర్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈనెల 30న సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన వంశీ పైడిపల్లి ఆడియో సీడీలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నర్తనశాల’అనే టైటిల్ పెట్టి సినిమా తీయడానికి చాలా ధైర్యంకావాలి. ఒక క్లాసిక్ సినిమాను తీసుకుని ఆ టైటిల్ పెట్టి.. అందులో క్యారెక్టర్స్‌ను కాంటెంపరరీగా తీసుకుని ఎంటర్‌టైన్ చేస్తూ తీసిన సినిమా ఇది. డైరెక్టర్ శ్రీనివాస్ నా కుటుంబంలోని వ్యక్తి. తనకు ఈ సినిమా చాలా పెద్దహిట్ అవుతుంది. గీత గోవిందంతో ఎంటర్‌టైన్ వేవ్‌స్టార్ట్ అయింది. అది నర్తనశాలకు కంటిన్యూ కావాలి. నాగశౌర్య ఇప్పటికీ సెల్‌ఫోన్ వాడడు. అంత కంటెంట్‌గా ఉండటం చాలా కష్టం. ఈ సినిమాపరంగా తనకు అభినందనలు. శంకర్‌, ఉషా వంటి తల్లిదండ్రులు ఉండటం తన అదృష్టం. కశ్మీరా, యామిని హీరోయిన్స్‌లకు ఈ సినిమా మంచి బ్రేక్‌ ఇవ్వాలి. అజయ్, శివాజీరాజా, సాగర్ మహతి, చంటిగారు, తమ్మిరాజుగారు సహా ఎంటైర్ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. ‘వంశీ పైడిపల్లిగారు మొదటి నుండి మా సినిమాకు తన సహకారాన్ని అందిస్తూ వస్తున్నారు. అజయ్, శివాజీరాజా, యామినీ, కశ్మీరా అందరూ చక్కగా సపోర్ట్‌ చేశారు. సాగర్ మహతితో ఛలో తర్వాత చేస్తున్న సినిమా. ఆ సినిమాలో చూసీ చూడంగానే.. సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. అదొక అద్భుతంలా జరిగింది. ఈ సినిమాలో ఎగిరే ఎగిరే... సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది. డైరెక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి సినిమాను చాలా బాగా తీశారు. చెప్పింది చెప్పినట్లు తీశారు. సాయిశ్రీరామ్‌గారు చాలా పెద్ద సపోర్ట్ చేశారు. మా అమ్మానాన్నలకు థాంక్యూ సోమచ్. వాళ్ల గురించి అంత కంటే ఎక్కువగా చెప్పలేను. ఎంత చెప్పినా తక్కువే అన్నారు. చిత్ర దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘శౌర్య, శంకర్‌, ఉషాకి థాంక్స్. సినిమా చాలా ప్లెజంట్‌గా, కామిక్‌గా ఉంటుంది. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్’ అన్నారు.