గీతా ఆర్ట్స్ చేతుల్లోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ శోభన్, రియాసుమన్ జంటగా నటిస్తున్న పేపర్‌బాయ్ ఈనెల 31న విడుదల కానుంది. ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది. నిర్మాతలు అల్లుఅరవింద్, బన్నీవాసు, దర్శకుడు మెహర్ రమేష్‌లకు ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా షోవేసి చూపించారు దర్శకుడు సంపత్ నంది. ఈయనే పేపర్‌బాయ్ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చూసిన తర్వాత మెచ్చుకుని ఈ రైట్స్ తీసుకుంది గీతాఆర్ట్స్. మంచి రేట్ ఇచ్చి ఈ హక్కుల్ని సొంతం చేసుకున్నారు అల్లు అరవింద్. ఈ చిత్రంతో జయశంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భీమ్స్ సిసిరేలియో సంగీతం అందించారు. సంతోష్ శోభన్, రియాసుమన్, తాన్యాహోప్, పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యురామన్, జయప్రకాశ్‌రెడ్డి, బిత్తిరిసత్తి, సన్నీ, మహేష్ విట్టా తదితరులు నటించిన ఈ సినిమాకు నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహా.