విజయంలో నీవెవరో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది పినిశెట్టి, తాప్సీ, రితికాసింగ్ హీరో హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘నీవెవరో’. కోన ఫిలిమ్స్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 24న విడుదలైంది. ఈ సందర్భంగా జరిగిన థాంక్యూ మీట్‌లో.. శివాజీరాజా మాట్లాడుతూ.. ‘ఆది తండ్రి రవిరాజా పినిశెట్టిగారి వంటి గొప్ప డైరెక్టర్ వల్లనే నేను నటుడిగా ఎదిగాను. ఆయన తనయుడు ఆది మా అందరికీ కావాల్సిన వాడే. నటనలో ఆది డేడికేషన్ తెలిసిందే. కోన వెంకట్‌కు సినిమాయే ప్రపంచం. రితికాసింగ్ మంచి నటి.. మంచి ఎనర్జీతో ఉంటుంది. సినిమా సక్సెస్‌కావడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు. దర్శకుడు హరినాథ్ మాట్లాడుతూ.. ‘మా ప్రయత్నాన్ని ఆదరించిన ఆడియెన్స్‌కు థాంక్స్. అవకాశం ఇచ్చిన కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణగారికి థాంక్స్. ప్రతి ఒక నటీనటులు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు. ఆదిగారు తన నటనతో కల్యాణ్ అనే క్యారెక్టర్‌కి ప్రాణంపోశారు. తాప్సీ, రితికాసింగ్‌కి థాంక్స్’ అన్నారు. రితికాసింగ్ మాట్లాడుతూ.. ‘నాలోని కొత్తకోణాన్ని పరిచయంచేసిన చిత్రమే నీవెవరో. నాపై నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చిన హరినాథ్, కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణగారు. సెట్స్‌లో సపోర్ట్‌చేసిన తాప్సీ, నీరజ కోన, తులసమ్మ, శివాజీరాజాగారు సహా అందరికీ థాంక్స్’ అన్నారు. చిత్ర సమర్పకుడు కోన వెంకట్ మాట్లాడుతూ.. ‘మా టీమ్ అందరం కలిసి ఓ సైన్యంలా పనిచేశాం. ఓ సినిమా నమ్మకంతోనే మొదలై.. నమ్మకంతోనే ఎండ్ అవుతుంది. నమ్మకం దేవుడితో సమానం. సినిమాను తీసేవాళ్లు.. చేసేవాళ్లు.. చూసేవాళ్లు.. అందరికీ జాబ్ శాటిస్‌ఫాక్షన్ ఇచ్చిన సినిమా. మా టార్గెట్ రీచ్‌అయ్యామని అనుకుంటున్నాం. జేబు శాటిస్‌ఫాక్షన్ ఇంకారాలేదు. ఆడియెన్స్‌కు సినిమా రీచ్ అవుతుంది. మా నమ్మకాన్ని అందరూ నమ్మాలని లేదు. కొత్త కానె్సప్ట్ సినిమాలుచేయాలని ప్రారంభించిన మా జర్నీలో మేంచేసిన నిన్నుకోరి.. ఈవాళ చేసిన నీవెవరో సినిమాలు వచ్చాయి. ఎంకరేజ్‌మెంట్ అందరికీ చాలా ముఖ్యం. ఈ సినిమాకోసం ఎవరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కొన్ని వందలు మంది.. వేల గంటలు పనిచేస్తే.. ఓ సినిమా వస్తుంది. అలాంటి సినిమాను ఓ పది రూపాయల పెన్‌తో కొట్టిపడేయడం సరికాదు. ఇది నా ఆక్రోశం కాదు.. ఆవేదన. ఆడియెన్స్ కోసమే మేం సినిమాలుచేస్తాం. రాసేవాళ్లు అది అర్థం చేసుకుంటే చాలు అన్నారు. ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. ‘ఈరోజు మేం సినిమా చేయడానికి ఏకైక కారణం ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే. ఆడియెన్స్‌లో రెండు రకాలుంటాయి. పదిశాతం మంది ప్రేక్షకులు సినిమాను విశే్లషిస్తే.. మిగిలిన 90శాతం ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే వెళ్తారు. అలాంటివారికి వంద శాతం నచ్చే సినిమా ఇది అన్నారు.