రాజశేఖర్ సరసన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ దర్శకుడు ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో డా.రాజశేఖర్ హీరోగా ‘కల్కి’ అనే టైటిల్‌తో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని కథ కూడా రొటీన్‌కి భిన్నంగా ఉంటుందని సమాచారం. కాగా ఈ చిత్రంలో నటించే నటీనటులను ముఖ్యంగా హీరోయిన్‌ని వెతికే పనిలో ఉంది చిత్ర బృందం. తాజాగా కబాలిలో సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తెగా నటించిన సాయి ధన్సిక ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందట. ఈ చిత్ర నిర్మాతలు కూడా ఆమెను సంప్రదించారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. త్వరలోనే దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఈ చిత్రంలోని మిగిలిన తారాగణంతోపాటుగా సాంకేతిక విభాగాన్ని కూడా ఖరారు చేయబోతున్నారు. గరుడవేగ లాంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత రాజశేఖర్ నటిస్తుండడం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరుతెచ్చుకున్న ప్రశాంత్‌వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. సి.కళ్యాణ్ మరియు రాజశేఖర్ కుమార్తెలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.