రొమాంటిక్ పాత్రలు ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగశౌర్య, కశ్మీరా జంటగా శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘నర్తనశాల’. ‘్ఛలో’ వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉషా ముల్పూరి నిర్మాత. ఈసినిమా ఈనెల 30న విడుదల అవుతున్న సందర్భంగా హీరోయిన్ కశ్మీరా పరదేశి చెప్పిన విశేషాలు..
నా గురించి..
నా మాతృభాష మరాఠి. పూణెలో పుట్టి పెరిగాను. ముంబైలో నిఫ్ట్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ చదివాను. చదువుతున్నపుడే మోడలింగ్ కూడా చేశా. అక్కడినుంచి ప్రభ థియేటర్స్‌లో కోర్సు చేశా. ఆడిషన్స్ ఇచ్చే క్రమంలో నర్తనశాల కోసం హీరోయిన్‌ను వెతుకుతున్నారని తెలిసింది. దాంతో హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి వస్తే నవరసాలను అభినయించమన్నారు. చేయగానే వీళ్లకు నచ్చింది. అలా ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యాను.
ఇన్నోసెంట్ గర్ల్..
ఇందులో నా క్యారెక్టర్ వెరీ సింపుల్ గర్ల్ అండ్ వెరీ కామ్, ఇన్నోసెంట్ గర్ల్. ఎంత ప్రాబ్లమ్ వచ్చినా ఫేస్‌చేస్తుంది గాని ఫైట్ చెయ్యదు. ఈ సినిమాలో టీచర్‌గా కనిపిస్తాను. కిడ్స్‌కి టీచింగ్ చేస్తాను. మొదట్లో తెలుగులో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టమయ్యేదికానీ ఆ తరువాత బాగా నేర్చుకున్నాను. చాలా సందర్భాల్లో మనసులో ఒకటికి రెండుసార్లు పదాలను కూడపలుక్కుని ఆ తర్వాత మాట్లాడుతున్నా. మొన్న ప్రీ రిలీజ్ వేడుకలోనూ మాట్లాడా. నటనలో నా బలం అంటే ప్రత్యేకంగా లవ్ అండ్ రొమాంటిక్ సీన్స్ కావచ్చు, ఇన్నోసెంట్ పెర్‌ఫార్మెన్స్‌కి సంబంధించిన క్యారెక్టర్ కావచ్చు. ఇలాంటివి బాగా చేస్తాను అని నమ్ముతున్నాను.
హీరో గురించి..
నేను ఇంతకుముందు సినిమాలు చేయలేదు కాబట్టి నాకు కెమెరా సెన్స్ లేదు. అయినా నాకు శౌర్య నేర్పించారు. డైలాగుల పరంగానూ హెల్ప్ చేశారు. కాస్ట్యూమ్స్ విషయంలో ఆంటీ, శౌర్య చాలా సాయం చేశారు. తను నిజంగా లలీ. ఆయన వెరీ డిసెంట్ అండ్ వెరీ నైస్.
తెలుగు సినిమాలు..
తెలుగు మూవీస్ రెగ్యులర్‌గా చూస్తా. అందరి హీరోల సినిమాలు చూస్తాను. అందరూ ఇష్టమే. కానీ అల్లు అర్జున్ అండ్ మహేష్‌బాబు అంటే ఇంకా ఇష్టం. అలాగే మెగాస్టార్ చిరంజీవిగారికి కూడా నేను పెద్ద అభిమానిని. ఈ ముగ్గురి సినిమాలు మాత్రం నేను అస్సలు మిస్‌కాను. తెలుగు సినిమాలు పూణెలో, ముంబాయ్‌లో కూడా డబ్ అవుతాయి. నాకు పర్సనల్‌గా తెలుగు లాంగ్వేజ్ అర్థం కాకపోయినా తెలుగు సినిమాలు రెగ్యులర్‌గా చూసేదాన్ని. తెలుగు సినిమాలో చాలా రకాల ఎమోషన్స్ ఉంటాయి.
డాన్స్..
నేను కథక్ డాన్సర్‌ని. బేసిగ్గా నాకు డాన్స్ యాక్టింగ్‌మీద ఆసక్తి కలిగింది. చిన్నప్పటినుంచి కథక్ నేర్చుకున్నాను. కథక్, హిప్‌హాప్ తెలుసు. ఇందులోనూ సంగీత పాటలో స్టెప్పులేశా. ఈ సినిమాతోపాటు తమిళంలో జీవీ ప్రకాష్, సిద్ధార్థ్‌తో ఓ సినిమా చేస్తున్నా.

- శ్రీ