16వ ‘సంతోషం’ అవార్డుల ప్రదానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

16వ సంతోషం సౌత్ ఇండియా ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం సాయంత్రం హైదరాబాద్ జెఆర్‌సి కనె్వన్షన్ సెంటర్‌లో ఆటపాటలతో.. తారల తళుకు బెళుకుల నడుమ వైభంగా ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్.జానకి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంకా పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు.. రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల నటీనటులకు అవార్డులు అందించడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ- నాకు అవార్డు ఇస్తానంటే వేడుకకు రాను. ఇవ్వనంటేనే వస్తానని సురేష్‌కి ముందే చెప్పాను. కాని గానకోకిల ఎస్.జానకి గారి చేతుల మీదుగా అవార్డు బహూకరించి నన్ను లాక్ చేసేసాడు. కాదనలేక అవార్డు తీసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటివరకూ ఆమె చేతులమీదుగా ఎప్పుడూ అవార్డు తీసుకోలేదు. అవార్డులు కొత్తవారికి ఇచ్చి ప్రోత్సహిస్తే బాగుంటుంది. వాళ్లలో ఉత్సాహం నింపినట్లు ఉంటుంది. వాళ్లను చూసి మరెంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తారు. కొత్తతరం నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిశ్రమకు ఎంతైనా అవసరం. సంతోషం వేడుకల్లో తొలిసారిగా అందాల తార శ్రీదేవి పేరుమీద స్మారక అవార్డును నెలకొల్పడం ఆనందంగా ఉంది. ఆమె పేరిట అవార్డును తమన్నా అందుకోవడం సంతోషంగా ఉంది అన్నారు. గానకోకిల ఎస్.జానకి మాట్లాడుతూ- సురేష్ ఐదు సంవత్సరాలనుంచి ఫంక్షన్‌కు రావాలని అడుగుతున్నాడు. ఈసారి ఖచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఇక్కడ చిరంజీవిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మెగాస్టార్‌కు చాలా సినిమాల్లో పాటలు పాడాను. ఖైదీ నంబర్ 150 చూశాను. పాత చిరంజీవిని చూసినట్లే ఉంది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి కూడా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ- 16 ఏళ్ళుగా సురేష్ ఒక్కడే అన్నీ తానై ఈ వేడుకను నిర్వహించడం చాలా గొప్ప విషయం. అతని ఓపిక, సహనానికి మెచ్చుకోవాల్సిందే.
ఇలాంటి అవార్డులు ప్రదానం చేయడం ద్వారా నూతన నటీనటుల్లో, సాంకేతిక నిపుణుల్లో ఉత్సాహం నింపినట్లు అవుతుంది. ఇక చిత్ర పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంకూడా ఎప్పుడూ ఉంటుంది అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ నాన్న(అల్లు రామలింగయ్య)గారి పేరుమీద సంతోషం అవార్డును 10 ఏళ్లుగా ఆయనకు గుర్తుగా సురేష్ ఇస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, కె.ఎల్.నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, బ్రహ్మాజీ, రచయిత సాయిమాధవ్ బుర్రా, టి.రాజేందర్, శ్రీయ, శేఖర్ మాస్టర్ తదితరులు ప్రసంగించారు.

అవార్డులు అందుకున్నవారు..

జీవిత సాఫల్య పురస్కారం - ఎస్.జానకి
అలెగ్జాండర్ స్పెషల్ జ్యూరీ అవార్డు - జయప్రకాష్‌రెడ్డి
అల్లు రామలింగయ్య స్మారక అవార్డు - బ్రహ్మాజీ
అక్కినేని నాగేశ్వరరావు స్మారక అవార్డు - రాజేంద్రప్రసాద్
శ్రీదేవి స్మారక అవార్డు - తమన్నా
రామానాయుడు స్మారక అవార్డు - మైత్రీ మూవీ మేకర్స్
బెస్ట్ హీరో - మెగాస్టార్ చిరంజీవి (ఖైదీ నెం 150)
బెస్ట్ హీరోయిన్ - శ్రీయాశరన్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
బెస్ట్ డైరెక్టర్ - సంకల్ప్ రెడ్డి (ఘాజీ)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ - సెంథిల్ కుమార్ (బాహుబలి)
బెస్ట్ కొరియోగ్రాఫర్ - శేఖర్ మాస్టర్ (ఖైదీ నెం 150)
బెస్ట్ డైలాగ్ రైటర్ - బుర్రా సాయిమాధవ్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
బెస్ట్ ఫైట్ మాస్టర్ - రామ్-లక్ష్మణ్ (గౌతమీపుత్ర శాతకర్ణి)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ - రేవంత్ (అర్జున్‌రెడ్డి)
బెస్ట్ సపోర్టింగ్ రోల్ - సీనియర్ నరేష్ (శతమానంభవతి)
బెస్ట్ డెబ్యూ హీరో - రక్షిత్ (లండన్‌బాబులు)
స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్ - మెహరీన్ (మహానుభావుడు)
స్పెషల్ జ్యూరీ ఫర్ బెస్ట్ హీరోయిన్ - ఈషా రెబ్బా (అమీతుమీ)