13న ‘యు టర్న్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘యు టర్న్’ విడుదల తేదీ సెప్టెంబర్ 13న ఖరారైంది. సమంత అక్కినేని, ఆది పినిశెట్టి ఇందులో కీలక పాత్రల్లో నటించారు. పవన్‌కుమార్ ఈ చిత్రాన్ని మిస్టర్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ‘యు టర్న్’ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తమిళ, తెలుగులో కలిపి దాదాపు 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యు టర్న్ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్‌లో తెరకెక్కించారు. రెండు భాషల్లోనూ ఒకేరోజు విడుదలకానుంది ఈ చిత్రం. రాహుల్ రవీంద్రన్, భూమికా చావ్లా యుటర్న్‌లో కీలక పాత్రల్లో నటించారు. పూర్ణచంద్ర తేజస్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్స్‌పై శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు యు టర్న్ చిత్రాన్ని నిర్మించారు. సమంత అక్కినేని, ఆది పినిశెట్టి, భూమికా చావ్లా, రాహుల్ రవీంద్రన్, నరైన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ, దర్శకత్వం: పవన్‌కుమార్, నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు, బ్యానర్స్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ మరియు వివై కంబైన్స్, సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాశ్, ఎడిటర్: సురేష్ ఆర్ముగం.