అమ్మ దీవెనతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమని కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘అమ్మ దీవెన’. పద్మ సమర్పిస్తున్నారు. లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పోసాని కృష్ణమురళి, అజయ్‌ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రధారులు. ఈ సినిమాకు ఎత్తరి గురువయ్య నిర్మాత. శివ ఏటూరి దర్శకుడు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. బి.గోపాల్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. ఈ సినిమా గురించి ఆమని మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి సినిమా. ఫ్యామిలీలో అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఎలా ఉంటుందనే విషయాన్ని చూపించే సినిమా. పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి తల్లి ఎంత కష్టపడుతుందనే విషయాన్ని ఇందులో చక్కగా చూపిస్తున్నారు. నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు ఇలాంటి కథను తీయడానికి. దర్శక నిర్మాతలు నన్ను కలిసి కథ చెబుతామని అన్నప్పుడు ఆలోచించాను. కానీ కథ విన్నాక ఏమీ మాట్లాడలేదు. చేస్తాననే అన్నాను. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా డిఫరెంట్ కేరక్టర్’ అని అన్నారు. అజయ్‌ఘోష్ మాట్లాడుతూ.. ‘‘ఒక మాతృమూర్తి. ఒక త్యాగశీలి కథ ఇది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న బంధాలను చక్కగా ఆవిష్కరించే సినిమా. ఇందులో నేను నెగటివ్ రోల్ చేస్తున్నాను’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘కథ విన్నాక అంగీకరించిన ఆమని గారికి ధన్యవాదాలు. చక్కటి కుటుంబ కథా చిత్రమిది. మా నిర్మాతలకు ధన్యవాదాలు’’ అని అన్నారు.