ఊటీలో ‘లాస్ట్ సీన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హర్షకుమార్, తులిక సింగ్ హీరోహీరోయిన్లుగా మధునారాయణ్ ముఖ్యపాత్రల్లో గ్లిట్టర్ ఫిల్మ్ అకాడమీ మరియు ఏజి. ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో దీపక్ బల్దేవ్ దర్శకత్వంలో ప్రకాష్‌ఠాకూర్ సమర్పిస్తున్న చిత్రం ‘లాస్ట్‌సీన్’. ఈనెల 16న ముహూర్తంతో మొదలైన ఈ చిత్రం, రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టివాలీ మరియు పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు దీపక్ బల్దేవ్ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు మరియు హిందీ భాషల్లో నిర్మిస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ ఊటీ, కెట్టివాలీ పరిసర ప్రాంతాల్లో 40రోజులుపాటు జరపాలనుకొంటున్నాం. ఈ ఊటీ షెడ్యూల్‌లో రెండు పాటలు మరియు ముఖ్యమైన సన్నివేశాల్ని పూర్తిచేస్తాం. అంతటితో సినిమా 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇక మిగిలిన 20 శాతంషూటింగ్‌ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. కథ విషయానికి వస్తే సిటీ లైఫ్ వద్దు అని స్వచ్ఛమైన ప్రకృతి వాతావరణంకోసం ఊటీలో సెటిల్ అవ్వాలనుకునే అబ్బాయి. పల్లెటూరు కంటే సిటీ లైఫ్ బాగుంటుంది అని సిటీ అబ్బాయిని లవ్‌చేసి సిటీలో సెటిల్ అవ్వాలనుకునే అమ్మాయి మధ్య ప్రేమ ఎలాపుట్టింది? అసలు ఆ ప్రేమ నిలబడుతుందా? అమ్మాయి మాట గెలుస్తుందా.. అబ్బాయి మాట గెలుస్తుందా అసలు ఈ ప్రేమ ఎవరి మాట గెలిపిస్తుంది? అనేది ఈ మా ‘లాస్ట్‌సీన్’ ప్రేమకథ. ప్రతి యువతీ యువకులకు నచ్చే వందశాతం ప్రేమకథ అని చిత్ర దర్శకుడు దీపక్ భలదేవ్ తెలుపుతూ రెండు షెడ్యూల్స్‌లో మూవీ షూటింగ్ పూర్తిచేసుకుని మార్చిలో విడుదలకు ప్లాన్‌చేస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: అనిల్, కెమెరామెన్: జవహర్‌రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్: రఘుకులకర్ణి, కాస్ట్యూమ్స్ డిజైనర్: రీటా బవాలి, మాటలు: రామం గోయల్, కోప్రొడ్యూసర్: అజయ్‌గౌతమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లా జగన్, కథ, కథనం మరియు దర్శకత్వం: దీపక్ బల్దేవ్.