స్టార్ ఇమేజ్ అంత సులువు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంగా మన పక్కింటి అబ్బాయిలా కనిపిస్తాడు నాగశౌర్య.. పైగా అతడు సినిమాలు కూడా అదే శైలిలో ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు. హీరోగా భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్న నాగశౌర్య ఇప్పుడిప్పుడే కమర్షియల్ హీరోగా ఇమేజ్ తెచ్చుకుంటున్నాడు. తాజాగా ఛలో సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన ఈసారి నర్తనశాలతో ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. కశ్మీరా పరదేశి, యామిని భాస్కర్‌లు హీరోయిన్స్. కొత్త దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్న నర్తనశాల ఈనెల 30న విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగశౌర్యతో ఇంటర్వ్యూ..
* వరుసగా కొత్త దర్శకులతో పనిచేస్తున్నారు, కారణం?
- అలా అని కాదు. కొత్త దర్శకులు కొత్త కథలతో వస్తున్నారు. వాళ్ళు చెప్పిన కథలు నచ్చుతున్నాయి కాబట్టి ఇలా వరుసగా కుదిరాయి.
* ఈ ఏడాదిలో నాలుగు సినిమాలతో జోరు పెంచారు?
- నిజమే.. ఈ ఏడాది నాలుగు సినిమాలు విడుదల కావడం యాదృచ్ఛికం అని చెప్పాలి. ఎందుకంటే అమ్మమ్మగారిల్లు, కణం సినిమాలు ఎప్పుడో విడుదల కావాల్సినవి.. కానీ ఈ ఏడాది వచ్చాయి. ఆ తరువాత ఛలో, ఇపుడు నర్తనశాల.. అలా కుదిరాయి మరి.
* ఇంతకీ నర్తనశాల కథ ఏమిటి?
- ఇందులో తేడా (గే) అయినా ఓ అబ్బాయిని అనుకోకుండా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించడం.. వారిమధ్య జరిగే కథ.. చాలా కొత్తగా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. వారి కథ ఎలాంటి మలుపులు తిరిగింది.. అసలు అతడు నిజంగా గేనా కాదా అన్నదే అసలు సినిమా.
* గే పాత్ర అంటున్నారు.. దర్శకుడు చెప్పగానే ఏమనిపించింది?
- కథ చాలా కొత్తగా ఉంది.. గే పాత్ర అయినా అది కథలో కీలకంగా ఉంటుంది కాబట్టి.. ఈ పాత్ర చేయడానికి ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. అందుకే చేశా. ఇది కొత్తగా ఉంటుంది. పైగా ఎవరిని కించపరిచే విధంగా ఉండదు.
* ఇంతకీ నర్తనశాల అనే టైటిల్ పెట్టడానికి కారణం.. టైటిల్‌వల్ల ఏమైనా వివాదాలు వచ్చాయా?
- ఈ కథ ప్రకారం నర్తనశాల అన్నది కరెక్ట్ టైటిల్ అని మీరు అంటారు. ఇక వివాదాలా.. అలాంటివి ఏమీ లేదు. అయితే నర్తనశాల అని టైటిల్ పెట్టి తీసిన సినిమాలు ఆగిపోయాయని తెలుసుకున్నాం.. అందుకే నర్తనశాల ముందు ఎట్ అని పెట్టాం.
* మహిళలపై జరుగుతున్న క్రైమ్ గురించి చర్చిస్తున్నట్టు తెలిసింది?
- ప్రస్తుతం సమాజంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యాయి. అందుకే మహిళలు ధైర్యంగా ఉండాలి. సమస్యలు వచ్చినపుడు ధైర్యంగా పోరాడాలి అని నా పాత్ర ద్వారా చెప్పిస్తున్నాం. ఈ రోజుల్లో నిజంగా మహిళలపై చాలా సంఘటనలు జరుగుతున్నాయి. అందుకే వారికి ధైర్యం అవసరం అన్న అంశం ఉంటుంది. పైగా అది కథ మొత్తం దాని చుట్టే జరగదు.. ఓ సందర్భంలో చెప్పడం జరిగింది.
* ఈమధ్య స్టార్ హీరో ఇమేజ్ అంటూ ఓ అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతూంది, దాని గురించి?
- నిజంగా స్టార్ ఇమేజ్ అనేది అది ఒక్క రోజులో రాదు అన్నది నా ఫీలింగ్. ఎందుకంటే స్టార్ ఇమేజ్ అంటే ఎన్టీఆర్, మెగాస్టార్ లాంటివారిని చూసాం.. వాళ్ళు ఆ ఇమేజ్ అందుకోవడానికి 30 ఏళ్ళు పట్టింది. మనం ఒకటో రెండో సినిమాలు చేసేసి సూపర్‌స్టార్స్ అనుకోవడం కరెక్టు కాదని నా నమ్మకం. ఉదాహరణకు పవర్‌స్టార్ సినిమా ఫ్లాప్ అయినా కూడా 80 కోట్లు వసూలు చేస్తుంది. అదీ ఇమేజ్ అంటే.. అంతే తప్ప నేను ఎవరినో దృష్టిలో పెట్టుకుని ఏదీ అనలేదు..
* దర్శకుడు గురించి?
- దర్శకుడు శ్రీనివాస్ చక్రవర్తి మంచి కథను చెప్పాడు. కథలో చాలా కొత్తదనం ఉంది. పైగా ఆయనకు మంచి గ్రిప్ ఉంది కథమీద. అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు.
* హీరోయిన్స్ గురించి?
- ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు.. ఒకరు కశ్మీరా పరదేశి, పూణే అమ్మాయి. ఇంకొకరు యామిని భాస్కర్, మన తెలుగమ్మాయి. ఇద్దరు పాత్రలు బాగుంటాయి. ఇద్దరు బాగా చేశారు కూడా.
* కొత్త దర్శకులను సొంత బ్యానర్లో పరిచయం చేస్తారా?
- లేదండి.. కొత్త పాత దర్శకులతో ఈ బ్యానర్‌లో సినిమాలు చేస్తాం. మంచి కథ ఎవరు చెప్పినా సరే.. సొంత బ్యానర్‌లో సినిమా అంటే కాస్త టెన్షన్‌గానే ఉంటుంది.
* పెళ్ళెప్పుడు?
- ప్రతి ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న వస్తుంది.. త్వరలోనే ఎవరినో ఒకరిని చూసుకుని చేసుకుంటా.
* తదుపరి సినిమాలు?
- రాజా అనే కొత్త దర్శళకుడితో భవ్య క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు రమణ తేజ అనే దర్శకుడితో మా సొంత బ్యానర్‌లోనే మరో సినిమా ఉంటుంది.

-శ్రీనివాస్ ఆర్.రావ్