వంద కోట్ల సినిమా ఇచ్చారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్-2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన గీత గోవిందం ఈనెల 15న విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచి.. వసూళ్ల పరంగా దూసుకుపోతు ఇప్పటికే వంద కోట్ల గ్రాస్‌ని రాబట్టి సంచలనం రేపుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మీడియాతో తన విజయాన్ని పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా గీత గోవిందం చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్ చెప్పాలి. ఊహించిన దానికంటే కూడా పెద్ద విజయాన్ని అందించారు. మంచి చిత్రాన్ని తీస్తే ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుందని నిరూపించారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలనుండి సూపర్ హిట్ టాక్ వచ్చింది. దానికంటే ముందు మంచి వసూళ్లు రావడం సినిమాకు ఈ ఆదివారంతో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం చాలా ఆనందంగా ఉంది. నన్ను నమ్మి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్, బన్నీవాసు, విజయ్ దేవరకొండలకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా విషయంలో నిర్మాతలు మొత్తంగా నన్నునమ్మి భారం వేశారు. సినిమా వారం రోజుల ముందు కొంత భాగం లీక్ అవ్వడంతో చాలా టెన్షన్ పడ్డాము. నిజంగా అల్లు అరవింద్‌గారు ఉన్నారు కాబట్టి దాన్ని తక్కువ టైంలోనే ఆపగలిగారు. నిజంగా ఇలాంటి లీకేజ్ చేసేవారిని గట్టిగానే శిక్షించాలి. దానివల్ల నిర్మాతలకు ఎంత నష్టం ఉంటుంది. ఇక ఈ సినిమా విషయంలో చిరంజీవి గారు, అరవింద్‌ల అభినందన మరచిపోలేము. ఇది నా పదేళ్ల కల. 2008లో యువత సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చా.. మంచి కమర్షియల్ సక్సెస్‌కోసం ఇన్నాళ్లు వెయిట్ చేశా. ఈ సినిమా తరువాత మళ్ళీ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఓ సినిమా ఉంటుంది. అది మనిషి.. దేవుడు అన్న కానె్సప్ట్‌తో ఉంటుంది. దాంతోపాటు మైత్రి బ్యానర్‌లో మరో సినిమా, అలాగే మంచు విష్ణుతోమరో సినిమా ఉంటుంది అని చెప్పారు.