‘నవాబ్’ ట్రైలర్‌కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గీతాంజలి, బాంబే, రోజా, సఖి వంటి ప్రేమకథలకైనా.. ఘర్షణ, దళపతి, యువ వంటి మెసేజ్ ఓరియెంటెడ్ ఎమోషనల్ చిత్రాలను రంజింపచేసేలా తెరకెక్కించడంలో మేటి దర్శకుడు మణిరత్నం. ఈయన దర్శకత్వంలో ఓ సినిమా వస్తోందంటే.. సినిమా ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. అలాంటి ట్రెండ్ క్రియేటర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న భారీ తారాగణంతో కూడిన భారీ బడ్జెట్ చిత్రం ‘నవాబ్’. లైకా ప్రొడక్షన్స్ సమర్పణలో మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రంలో అరవిందస్వామి, జ్యోతిక, అరుణ్ విజయ్, ఐశ్వర్య, రాజేష్, శింబు, విజయ్ సేతుపతి, ప్రకాశ్‌రాజ్, త్యాగరాజన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలను తెలిపారు. ఇప్పటికే మిలియన్ వ్యూస్‌ను రాబట్టుకుని సోషల్ మీడియాలో సెనే్సషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ- నవాబ్ ట్రైలర్‌ను విడుదల చేసిన కింగ్ నాగార్జునకి థాంక్స్. మణిరత్నం సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. ఇపుడు ఆయన దర్శకత్వంలో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రానున్న చిత్రమే నవాబ్. సినిమా కానె్సప్ట్ ఏంటో అందరికీ అర్థమయ్యే వుంటుంది. మంచి యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంటూనే ఎమోషనల్ కంటెంట్‌తో సాగే చిత్రమిది. భారీ తారాగణంతో, ఎ.ఆర్.రెహమాన్, సంతోశ్ శివన్, శ్రీకర్ ప్రసాద్, సిరివెనె్నల వంటి టెక్నీషియన్స్ సహకారంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలను మించేలా సినిమా ఉంటుందనడంలో సందేహం లేదు అన్నారు.