అందరికీ నచ్చే ‘పేపర్‌బాయ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ శోభన్, రియా సుమన్, తన్య హూప్ హీరో హీరోయిన్లుగా సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా ‘పేపర్‌బాయ్’. జయశంకర్ దర్శకత్వం వహించారు. ఈ నెల 31న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ మాట్లాడుతూ- మెహర్ రమేశ్ నాకు ఫోన్ చేసి పేపర్‌బాయ్ సినిమా చూశాను. అరవింద్‌గారికి సినిమా చూపించబోతున్నాను అని చెప్పారు. అరవింద్‌కి సినిమా నచ్చింది. ఆయన సినిమా హక్కులను తీసుకున్నారు అని చెప్పగానే సినిమా చాలా పెద్ద హిట్ అని ఫిక్స్ అయిపోయాను. ఇప్పుడు ఇది పెద్ద సినిమా. మా శోభన్‌గారి అబ్బాయి సంతోశ్ పెర్‌ఫామర్ అని ప్రూవ్ చేసుకున్నారు. ఇపుడు మంచి హీరోగా ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ- ఈ సినిమాకు గీతా ఆర్ట్స్ వంటి పెద్ద ఫ్లాట్‌ఫామ్ దొరికింది. చిన్న సినిమా నిర్మాతలకు ఉండే కష్టాలేంటో నాకు తెలుసు. సంపత్‌నంది లాంటి దర్శకుడు మరో దర్శకుడికి అవకాశం ఇస్తూ సినిమాలు చేయడం గొప్ప విషయం. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ- ఓసారి బన్ని ఈ సినిమా ట్రైలర్‌ను పంపి చూడమంటే చూసి చాలా బాగుంది అన్నాను. తర్వాత మెహర్ రమేశ్ ఈ సినిమాని చూడమన్నాడు. సరేనని చూశాను. చాలా బావుంది. మా సంస్థలో రీసెంట్‌గా వచ్చిన గీతగోవిందం ఎఫెక్ట్ నాలుగైదు వారాలు ఖచ్చితంగా ఉంటుంది. ఇలాంటి తరుణంలో మా బ్యానర్‌లో పేపర్‌బాయ్ లాంటి మరో మంచి సినిమాను విడుదల చేస్తే బావుంటుందనే ఆలోచన కలిగింది. మంచి సినిమా చేసినపుడు మా సంస్థ ద్వారా విడుదలైతే ఇంకా ప్రజలకు బాగా రీచ్ అవుతుంది. కాబట్టి సపోర్టు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.