టాలెంట్ వుంటే ఎన్నో అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావనే అపవాదు ఉంది. అయినా సరే తెలుగు అమ్మాయిలు కూడా టాలీవుడ్‌లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా మరో తెలుగు హీరోయిన్ అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. ఆమే యామిని భాస్కర్. కీచక సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన యామిని, తాజాగా నాగశౌర్య సరసన నర్తశాలలో నటించింది. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు విడుదవుతున్న సందర్భంగా యామిని భాస్కర్ చెప్పిన విశేషాలు..
నర్తనశాలలో..
సత్యభామ అనే పాత్రలో నటించాను. కృష్ణవంశీ సినిమాల్లోలాగానే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఉంటుంది. నాతోపాటు మరో హీరోయిన్ కశ్మీర పరదేశి నటించినప్పటికీ మా ఇద్దరి క్యారెక్టర్స్‌కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. తనది చాలా సాఫ్ట్ క్యారెక్టర్. నాది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే ఒక ధైర్యవంతురాలైన అమ్మాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను. కీచక సినిమా తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దానికి కారణం అందరికీ తెలిసిందే కదండి.. తెలుగు అమ్మాయిలకి హీరోయిన్స్‌గా ఛాన్స్ ఇవ్వరని నేను చెప్పను. కీచక సినిమాలో నాకు మంచి పేరు వచ్చింది. ఇపుడు నర్తనశాల తర్వాత నాకు అంతా బాగుంటుందని అనుకుంటున్నాను.
కీచక తర్వాత..
తమిళంలో మన్నోడి అని ఓ సినిమా చేశాను. అది గత ఏడాది జూలైలో రిలీజ్ అయింది. ఆ తరువాత మారుతిగారు బ్యానర్‌లో భలే మంచి బేరం అని ఓ సినిమా చేశాను. అది సెప్టెంబర్‌లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నా. ఈ సినిమా నా కెరీర్‌లో పెద్ద సినిమా అని చెప్పాలి.
తెలుగు అమ్మాయిగా..
మాది విజయవాడ. సినిమాలకోసమే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. చిన్నప్పటినుండి సినిమాలంటే ఇష్టం కానీ ఎప్పుడూ హీరోయిన్ అవ్వాలని అనుకోలేదు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అప్స్ అండ్ డౌన్ ఎప్పుడూ ఉంటాయి. టైం బాగుండాలి. మంచి టైమ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇక్కడ పోటీ చాలా ఎక్కువ. మరి ఆ పోటీని తట్టుకుని నిలబడాలి కదా!
నాగశౌర్యతో
నాగశౌర్యతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. తనతో ఉండే నటీనటులకు ఎంతో సపోర్టు అందిస్తాడు. ఈ సినిమా తరువాత ఇంకా ఏ చిత్రానికి ఓకె చెప్పలేదు. తప్పకుండా ఈ సినిమా తరువాత నా కెరీర్ మంచి ఊపందుకుంటుందన్న నమ్మకం ఉంది. మంచి పాత్రల్లో నటించాలని.. నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది.

- శ్రీ