అందరికీ నచ్చిన దృశ్యకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిమ్‌మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘దృశ్యకావ్యం’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో ప్రముఖ నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ, తాను నటించిన ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రాన్ని నిర్మించిన రామకృష్ణ ఈ సినిమాతో దర్శకుడిగా మారి చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్ని రాబడుతోందన్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయని, ఇలాగే ఆయన మరిన్ని మంచి చిత్రాలు తీయాలని అన్నారు. దర్శకుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, అన్ని ఏరియాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని, ముఖ్యంగా ఈ సినిమాలో చూపించిన తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటున్నారని, కమలాకర్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచిందని అన్నారు. కమలాకర్ మాట్లాడుతూ, పాటలతోపాటు నేపథ్య సంగీతం బాగుందన్న టాక్ వచ్చిందని, ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు. హీరోయిన్ కశ్మీరా మాట్లాడుతూ, ఇంత మంచి సినిమాలో నటించినందుకు ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో రామ్‌కార్తీక్, నాగిరెడ్డి, సంతోష్ పాల్గొన్నారు.