బాలీవుడ్ కత్తివీరుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో అటు హీరో విజయ్ నటించిన కత్తి.. ఇటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నంబర్ 150 చిత్రాలు సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సంచలన దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో ఆయనే కథ అందించిన ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లనుంది. ఈ సినిమా హక్కులను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత సంజయ్ లీలాబన్సాలీ తీసుకున్నారు. ఆయన నిర్మించే ఈ సినిమాలో హీరో ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తినెలకొన్న విషయం తెలిసిందే. ఈ కత్తి రీమేక్‌లో హీరో ఎవరనే విషయంలో పలువురు హీరోల పేర్లు వినిపించాయి. అందులో అక్షయ్‌కుమార్, రణవీర్‌సింగ్, సల్మాన్‌ల పేర్లు వినిపించాయి. ఫైనల్‌గా కత్తివీరుడు ఎవరో తెలిసింది. ఆయన ఎవరోకాదు రణ్‌వీర్‌సింగ్. సంజయ్‌లీలా బన్సాలీ సొంత హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న రణ్‌వీర్‌సింగ్‌తోనే ఈ సినిమా తెరకెక్కిస్తారట. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న దీనికి దర్శకుడు ఎవరనే విషయం తెలియాల్సి వుంది.