భారతీయుడు 2లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక నాయకుడు కమల్‌హాసన్-శంకర్ కలయికలో సూపర్‌హిట్ చిత్రం భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా భారతీయుడు-2 చిత్రం తెరకెక్కనుందని తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం కోసం లొకేషన్స్ వేటలో వున్నారు దర్శకుడు శంకర్. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో ఒక లొకేషన్‌ను ఫిక్స్ చేశారట. ఇక ఈ చిత్రం నవంబర్ చివరి వారంలో సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా లేడీ సూపర్‌స్టార్ నయనతారను తీసుకోవాలనుకుంటున్నారట శంకర్. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.