రెగ్యులర్ షూటింగ్‌లో దండుపాళ్యం-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూజాగాంధీ, రఘుముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో రూపొందిన ‘దండుపాళ్యం’ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘దండుపాళ్యం-2’ చిత్రాన్ని రూపొందించనున్నారు.
ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ, 2013లో విడుదలైన ‘దండుపాళ్యం’ చిత్రం తెలుగులో సంచలన విజయం సాధించిందని, మూడు కేంద్రాల్లో వంద రోజులు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు మూడేళ్ల సమయం పట్టిందని, ఈనెల 24న ఈ షూటింగ్ ప్రారంభిస్తున్నామని, ఆగస్టు, సెప్టెంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తామన్నారు. దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ, దండుపాళ్యం సినిమా ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలుసునని, దానికి కన్‌క్లూజన్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాలని ప్రయత్నిస్తున్నామని, ఈ చిత్రంలో నిజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించబోతున్నామని, ‘దండుపాళ్యం’ సినిమా తర్వాత దీన్ని రీమేక్ చేయాలని అనుకున్నానని, కానీ మధ్యలో రెండు సినిమాలు చేయడంవల్ల ఇంత సమయం పట్టింది. మొదటి భాగంలో ఉన్న నటీనటులందరూ ఇందులో ఉంటారని, వారితోపాటు మరో పది మంది కొత్త నటులు చేయనున్నారని చెప్పారు. చరిత్రలో కొన్ని సంఘటనలు ఇప్పటికీ మనల్ని షాక్‌కు గురిచేస్తుంటాయి. ఆ తరహా బయోపిక్‌లపై సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నానని, ఈ సినిమాలో ఎలాంటి మెసేజ్ ఉండదని, నేరం ఎలా జరుగుతుంది? దాని పర్యవసానాలు ఏంటి అనేదే ప్రధానంగా తెరకెక్కిస్తున్నామన్నారు.