డైనమిక్ లేడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో గురువారం రాత్రి 9.30 గంటలకు మృతి చెందారు. సినీ జర్నలిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఆ తర్వాత సినిమాలపై మక్కువతో దర్శకత్వం శాఖలోకి అడుగుపెట్టారు. 2002లో ‘ప్రేమలో పావని కళ్యాణ్’ చిత్రం ద్వారా దర్శకురాలిగా మారారు. టాలీవుడ్‌లో మహిళా దర్శకులు చాలా తక్కువ. అందులోను ఉన్న ఇద్దరు ముగ్గురు దర్శకులు కూడా తమదైన సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఆ లిస్ట్‌లో డైనమిక్ లేడీ డైరెక్టర్‌గా మంచి పేరుతెచ్చుకున్నారు బి.జయ. ‘ప్రేమలో పావని కళ్యాణ్’ తరువాత ‘చంటిగాడు’ చిత్రంతో మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. అటుపై ప్రేమికులు, గుండమ్మగారి మనువడు, సవాల్, లవ్‌లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె రూపొందించిన చివరి చిత్రం ‘వైశాఖం’. కామ్న జెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎం.ఏ. చేసిన జయ ప్రముఖ సినీ పాత్రికేయుడు, పి.ఆర్.ఓ బి.ఏ రాజును వివాహం చేసుకున్నారు. జయ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నాగార్జున, నాగచైతన్య, సమంత, అల్లు అరవింద్, దిల్‌రాజు, డి.సురేష్‌బాబు, నాని, రాజ్‌తరుణ్, నిఖిల్, మహేష్‌బాబు దంపతులు, వెంకటేష్, వంశీ పైడిపల్లి, సుకుమార్, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్, గుణశేఖర్, మంచు మనోజ్, హేమ, అపూర్వ, సీనియర్ జర్నలిస్టులు సుబ్బారావు, నారాయణరాజు, మోహన్‌గోటేటి, ప్రభు, ఎం.డి అబ్దుల్, ప్రదీప్, యజ్ఞమూర్తి, రెడ్డి హనుమంతరావు, శ్రీనివాస్ ఆర్.రావ్ తదితరులు జయ భౌతిక కాయానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జయ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం వారి స్వగ్రామం. తండ్రి నర్సింహరాజు, మెడికల్ రిప్రజెంటేటివ్. అమ్మ విమలాదేవి గృహిణి. పశ్చిమ గోదావరి జిల్లాలోని అమ్మమ్మ ఊరు సిద్ధాంతంలో పుట్టారు. ముగ్గురు ఆడపిల్లలు. అందులో జయ పెద్ద అమ్మాయి. గోదావరి నదీ తీరమే ఆట మైదానంగా ఆమె బాల్యం సాగింది. విజయవాడలో మాంటిస్సోరిలో పదవ తరగతి వరకు చదివిన ఆమె ఇంటర్ అమలాపురంలోని ఎస్‌కెబిఆర్ కాలెజీలో, డిగ్రీ మద్రాసులోని ఎస్‌ఐఇటి ఉమెన్స్ కాలేజీలో పూర్తిచేశారు. ఆ తర్వాత చెన్నై విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. ఇంగ్లీష్ లిటరేచర్‌తో ఎం.ఎ. జర్నలిజంలో డిప్లొమా చేశారు. అన్నామలై విశ్వవిద్యాలయంలో సైకాలజీలో ఎం.ఎ. చదివారు. కథలతోపాటు కార్టూన్లువేయడం ఆమె హాబీగా మారింది. అలా వేసిన కార్టూన్స్ వివిధ దినపత్రికల్లో వచ్చాయి. ‘యువ’లో వచ్చిన కథకు చక్రపాణి అవార్డు, ‘వనిత’లో ప్రచురితమైన ‘ఆనందోబ్రహ్మ’ కథకు జాతీయ అవార్డు వచ్చాయి. ఈ కథను నేషనల్ బుక్ ట్రస్ట్ ఇతర భాషల్లోకి అనువదించి ప్రచురించారు. జ్యోతిచిత్రలో పనిచేస్తున్నప్పుడే బి.ఏ. రాజుతో పెళ్ళి జరిగింది. ఆయన సూచనతో ‘సూపర్‌హిట్’ సినిమా పత్రికను ప్రారంభించి సక్సెస్ అయ్యారు. 2002లో దీపక్, అంకిత హీరోహీరోయిన్స్‌గా నటించిన ‘ప్రేమలో పావని కళ్యాణ్’ చిత్రం ద్వారా దర్శకురాలిగా మారారు. చంటిగాడు సినిమా దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె తెరకెక్కించిన లవ్‌లీ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా ఆమె లక్కీఫెలో అనే సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. కొత్త నటీనటులను తెరకు పరిచయం చేయడంతోపాటు.. కుటుంబమంతా కలిసి చూసే కథా చిత్రాలను తీస్తూ.. అరుదైన లొకేషన్స్‌ను తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న డైనమిక్ డైరెక్టర్ బి.జయ. సినీ రంగంలోని 24క్రాఫ్ట్స్‌పై పట్టుసాధించిన ఆమె కలంపట్టి జర్నలిస్టుగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. ఆ తర్వాత మెగాఫోన్ అందుకుని కెప్టెన్ ఆఫ్ ది షిప్‌గా మారారు. ఆమె అకాల మరణం పట్ల చిత్రసీమ దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. కొత్తవారితోనే సినిమా తీయడానికి ఇష్టపడతాను. కథ నచ్చితేనే.. ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి సిద్ధపడతాను. నాపై నమ్మకంతో మావారు బి.ఏ. రాజు నన్ను ఎంతో ప్రోత్సహిస్తారు అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు జయ.

చిత్రాలు..మహేష్‌బాబు *వెంకటేష్
*బి.ఏ రాజుకు చిరంజీవి పరామర్శ *మంచు మనోజ్