రేసుగుర్రం 2 రానుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా విషయంలో జోరు పెంచినట్టున్నాడు. ఇప్పటికే మనం ఫేమ్ విక్రమ్‌కుమార్‌తో సినిమాకు ఓకే చెప్పిన బన్నీ మరోవైపు తమిళ దర్శకుడు శివతో సినిమాకు రెడీ అయ్యాడు. దాంతోపాటు తాజాగా మరో దర్శకుడు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆయన ఎవరోకాదు ఇదివరకే అల్లు అర్జున్‌తో రేసుగుర్రం లాంటి సంచలన విజయాన్ని అందించిన మెగా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి. ప్రస్తుతం ఆయన మెగాస్టార్‌తో సైరా చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపుగా పూర్తికావొచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత సురేందర్‌రెడ్డి బన్నీతోనే సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడట. స్టయలిష్ ఫిలిం మేకర్‌గా ఇమేజ్ తెచ్చుకున్న సురేందర్‌రెడ్డికి మెగా కాంపౌండ్‌లో మంచి క్రేజ్ ఉంది. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా బహుశా రేసుగుర్రం-2 కావొచ్చని టాక్.