కమల్ బ్యానర్‌లో విక్రమ్ సినిమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ నటుడు కమల్‌హాసన్ నటుడిగా ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్నాడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటుడిగానే కాకుండా దర్శకుడిగా, అటు నిర్మాతగా కూడా పాపులర్ అయ్యారు. తాజాగా విశ్వరూపం 2 చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు ఆయన బ్యానర్‌లో ఆయన హీరోగానే సినిమాలు తీసేవారు. కానీ కమల్‌హాసన్ విక్రమ్ హీరోగా ఓ సినిమాను మొదలుపెట్టారు. చియాన్ విక్రమ్ హీరోగా రాజ్‌కమల్ బ్యానర్స్ పతాకంపై రాజేష్ సెల్వ దర్శకత్వంలో ఈ సినిమా శుక్రవారం చెన్నయ్‌లో మొదలైంది. అన్నట్టు విక్రమ్ సరసన కమల్ రెండో కూతురు అక్షరహాసన్ నటిస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈమధ్య విక్రమ్‌కు కూడా సక్సెస్ అందడం లేదు. అందుకే ఆయన అప్పట్లో తనకు సూపర్ హిట్ ఇచ్చిన సామి చిత్రానికి సీక్వెల్‌గా సామి 2 చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది.