లవ్ ఈజ్ బ్లైండ్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె.యస్.నాగేశ్వరరావు దర్శకుడిగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరా ఫిలింస్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీమతి చదలవాడ పద్మావతి నిర్మిస్తున్న ‘లవ్ ఈజ్ బ్లైండ్’ అనే చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలోని మహానటి సెట్‌లో లాంఛనంగా ప్రారంభమయంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతిభగల కొత్త తరాలవారిని ప్రోత్సహించడంలో భాగంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ చిత్ర దర్శకుడు కె.యస్.నాగేశ్వరరావును మేము గతంలో దర్శకుడిగా పరిచయం చేశాం. అతను మంచి ప్రతిభ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. ఒక చక్కటి ప్రేమకథతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మా బేనర్‌కు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం పదిహేను రోజులపాటు ఈ షెడ్యూలు రామోజీ ఫిలిం సిటీలో ఉంటుంది. తరువాత ముప్పయి రోజులపాటు కాశ్మీర్‌లో షూటింగ్ జరుగుతుంది. తరువాత హైదరాబాద్‌లో జరిగే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. ఈ సినిమాకు సాబు వర్గీస్ మంచా సంగీతాన్ని అందించారు అన్నారు. దర్శకుడు కె.యస్.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కొంత విరామం తరువాత మళ్ళీ మా మాతృసంస్థలో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఇది నేటితరం యువతరాన్ని ప్రతిబింబించే ప్రేమకథా చిత్రం మళ్ళీ వారి బేనర్‌లో నాకు సినిమా ఇచ్చినందుకు నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. రామ్‌కార్తీక్, సహర్ హప్ష జంటగా నటిస్తున్న ఈ సినిమాలోని మిగిలిన పాత్రల్లో సత్యకృష్ణన్, వెనె్నల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు మాటలు: జియోలక్ష్మణ్, కెమెరా: మజీర్ మాలిక్, సంగీతం: సబు వర్గీస్, ఫైట్స్: జాషువా, ఎడిటర్: వి.రామారావు, ఆర్ట్: ఇ.గోవింద్, ప్రొడక్షన్ కంట్రోలర్: ధరణేష్ కొనికినేని, నిర్మాత: శ్రీమతి చదలవాడ పద్మావతి, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.యస్.నాగేశ్వరరావు.