విదేశాలకు మహర్షి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా ఏకధాటిగా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంది. గత కొన్ని రోజులుగా హైదరాదాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపిన ఈ టీమ్ తదుపరి షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లనున్నారు. అమెరికా, న్యూయార్క్, కాలిఫోర్నియా, లాస్‌వేగాస్ లాంటి ప్రాంతాల్లో ప్లాన్ చేసారు. దాదాపు రెండు నెలలపాటు అక్కడే షూటింగ్ జరగనుందట. కీలక సన్నివేశాల చిత్రీకరణతోపాటు రెండు పాటలను చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్న ఈ టీమ్ వచ్చేవారంలోనే విదేశాలకు వెళ్ళనుంది. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే సర్వత్రా ఆసక్తి నెలకొంది. వినాయక చవితి సందర్భంగా టీజర్‌ని కూడా విడుదల చేస్తారట. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాదికి విడుదల చేయనున్నారు. ఇక మహేష్ హీరోగా తెరకెక్కే 26వ సినిమాకోసం దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ విషయంలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి రానున్నట్టు సమాచారం.