గ్రామీణ నేపథ్యంలో ‘నాటకం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు అనిల్ రావిపూడి ‘నాటకం’ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఆశిష్‌గాంధీ, ఆషియా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి. గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తిచేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయికార్తీక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్ అంజి ఈ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయిదీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్‌గాంధీ, ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు. ఆశిష్‌గాంధీ, ఆషియానర్వాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం: కళ్యాణ్ జి.గోగన, సమర్పణ: రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్, నిర్మాతలు: శ్రీ సాయిదీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్‌గాంధీ, ఉమా కూచిపూడి, సంగీతం: సాయికార్తీక్, డిఓపీ: గరుడవేగ అంజి, ఎడిటర్: మణికాంత్.

చిత్రం..ఆశిష్‌గాంధీ, ఆషియానర్వాల్